మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా అసభ్యంగా ప్రవర్తించి నిందలు మూట కట్టుకోలేదు.అయితే చిరంజీవిపై కూడా కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేశారు.
ఈయనకి రాధా(Radha), సుహాసిని వంటి ఇంకా కొంతమంది హీరోయిన్లతో అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ హీరోయిన్ కారణంగా ఆహారం తినడం మానేశారట.అయితే ఆహారం తినడం అంటే పూర్తిగా కాదు నాన్ వెజ్ తినడం మానేశారట.
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.ఎందుకు ఆ హీరోయిన్ కోసం నాన్ వెజ్ తినడం మానేసారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి కేవలం హీరో గానే కాకుండా కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు.ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పించారు.అయితే అలాంటి చిరంజీవి యాక్షన్ హీరో అర్జున్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా చేసిన శ్రీ మంజునాథ (Sree Manjunatha) సినిమాలో శివుడి పాత్రలో నటించి మెప్పించారు.ఇక ఈ సినిమాలో పార్వతీ పాత్ర హీరోయిన్ మీనా( Meena ) పోషించింది.
ఇక ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో మీనా సినిమా షూటింగ్ అయిపోయే వరకు కూడా నాన్ వెజ్( Non Veg ) ముట్టకూడదు అనే నిర్ణయం తీసుకుందట.
అయితే మొదట్లో చిరంజీవి ఇవన్నీ పట్టించుకోకుండా తింటూ ఉండేవారట.కానీ ఎప్పుడైతే మీనా (Meena) మనం దేవుడి పాత్రలో నటిస్తున్నాం కాబట్టి నేను సినిమా షూటింగ్ అయిపోయే వరకు నాన్ వెజ్ తినడం మానేశాను అని చెప్పిందో అప్పటినుండి మీనాని అనుసరించి చిరంజీవి కూడా శ్రీ మంజునాథ సినిమా షూటింగ్ అయిపోయే వరకు కూడా నాన్ వెజ్ ముట్ట లేదట.అలా హీరోయిన్ మీనా కారణంగా ఆయన నాన్ వెజ్ కి కొద్దిరోజులు దూరమయ్యారు.