జక్కన్న డైరెక్షన్ లో నటించనన్న చిరంజీవి.. రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటూ గతంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం రాలేదు.

 Chiranjeevi Shocking Comments About Rajamouli Direction Details Here Goes Viral-TeluguStop.com

రాజమౌళి ఇప్పటికే పలువురు హీరోలతో సినిమాలను తెరకెక్కించినా సీనియర్ హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే నాకు చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. జక్కన్న అంటే ఇష్టం ఉన్నా ఆయన డైరెక్షన్ లో నటించాలని లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.

రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ అని ప్రపంచానికి భారతీయ సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని తెలిపారని చిరంజీవి అన్నారు.జక్కన్న ప్రతి విషయాన్ని లోతుగా చూస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు.రాజమౌళి కోరుకునే ఔట్ పుట్ ను నటుడిగా నేను ఇస్తానో లేదో చెప్పలేనని ఆయన కామెంట్లు చేశారు.

రాజమౌళి ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి మూడు నుంచి ఐదేళ్ల పాటు శ్రమిస్తారని నేను ప్రస్తుతం ఒకే సమయంలో నాలుగు సినిమాలలో నటిస్తున్నానని రాజమౌళి డైరెక్షన్ లో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని నాకు లేదని ఆయన కామెంట్లు చేశారు.నా టాలెంట్ కు నా కొడుకు రామ్ చరణ్ కొనసాగింపు అని చిరంజీవి వెల్లడించడం గమనార్హం. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.చిరంజీకి ఈ సినిమాలో హీరోయిన్ లేదనే సంగతి తెలిసిందే.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube