తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే పేరు మెగాస్టార్ చిరంజీవి…( Megastar Chiranjeevi ) సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంతో ఏలుతూ ముందుకు దూసుకెళ్తున్న హీరో చిరంజీవి గారే కావడం విశేషం… ఇక తన అభిమానులందరు దర్శకులుగా మారుతున్న నేపధ్యంలో వాళ్లతో సినిమాలు చేసి ఉంటే చిరంజీవి ఎలా ఉంటాడో మరోసారి ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు.

ఇంకా ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమైన చిరంజీవి సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో( Ram Charan ) ఒక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక అల్లు అర్జున్ తో ( Allu Arjun ) కూడా మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవితో ఆయన సినిమా చేయడం సాధ్యమేనా ఒకవేళ చేసిన ఆ సినిమా భారీ మాస్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతుందా లేదంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఆయన స్టైల్ లో తెరకెక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

చిరంజీవి సందీప్ రెడ్డివంగా కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… నిజానికి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే అది పూర్తిగా చిరంజీవి స్టైల్ లో వస్తుందా లేదంటే సందీప్ రెడ్డి వంగ స్టైల్ లో వస్తుందా అనేది తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
.