రజినీకాంత్ కమల్ హాసన్ భాట లో నడుస్తున్న చిరంజీవి...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు వాళ్ల జీవిత కాలంలో ఒక్కసారి అయినా గాని చిరంజీవి( Chiranjeevi ) లాంటి లెజెండ్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటారు.

అయితే ఇది అందరికీ దొరికే అదృష్టం అయితే కాదు.

ఎందుకంటే చిరంజీవి తో సినిమా చేయాలి అంటే దానికి సంబంధించిన చాలా లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది.దానికి అనుగుణంగా ఏ డైరెక్టర్ అయితే లెక్కలోకి సరిపోతాడో ఆ డైరెక్టర్ కు మాత్రమే సినిమాలు ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో తన 157 వ సినిమా ( Mega 157 )చేస్తున్నాడు.అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ కి సంబంధించిన సినిమా కావడం వల్ల ఇది చాలా కొత్తగా ఉండబోతుంది అని డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు.ఇందులో చిరంజీవి ఒక మెచ్యూర్ క్యారెక్టర్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

అంటే జైలర్ సినిమాలో రజనీకాంత్ చేసినట్టుగా,విక్రమ్ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) చేసినట్టు గా ఒక.ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట.అంటే ఈ క్యారెక్టర్ కి హీరోయిన్స్ ఉండరు అలాగే సాంగ్స్ గాని ఏమీ ఉండవు.ఓన్లీ కథ మీద బేస్ చేసుకుని మాత్రమే సినిమా నడుస్తూ ఉంటుంది

Advertisement

ఇలాంటి సినిమాలు తమిళ్ , మలయాళం లో చాలామంది హీరోలు చేస్తున్నారు.తమిళంలో అయితే రజనీకాంత్( Rajinikanth ), కమల్ హాసన్ ( Kamal Haasan )చేస్తున్నారు.ఇక మలయాళం విషయానికొస్తే మమ్ముట్టి ,మోహన్ లాల్ లు కూడా ఇలాంటి తరహా క్యారెక్టర్ లు ఉన్న సినిమాలు చేస్తున్నారు.

కానీ ఇది చిరంజీవి కి మాత్రం కొత్త అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటివరకు చిరంజీవి తనతో పాటు హీరోయిన్ ఉండి, రొమాంటిక్ సీన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేశాడు.

కానీ ఇది దానికి చాలా భిన్నంగా చాలా కొత్తగా ఉండే సినిమా అందుకే ఇది అభిమానులకు కూడా చాలా కొత్త ఫీల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు