మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ నెలకొంది.భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) హిట్ అయ్యి ఉంటే ఇప్పటికే చిరంజీవి బ్రో డాడీ సినిమా( Bro Daddy ) రీమేక్ పనులు షురూ అయ్యేవి.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధించడంలో విపలం అయింది.దాంతో తపరి సినిమా ఏంటా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.
చిరంజీవి బ్రో డాడీ రీమేక్ అనగానే అభిమానులు పెదవి విరుస్తున్నారు.ఈ మధ్య కాలంలో వరుసగా నిరాశ పరుచుతున్న చిరంజీవి మళ్లీ రీమేక్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ విమర్శలు చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు.

ఈ నేపథ్యం లో చిరంజీవి బ్రో డాడీ ( Bro Daddy )స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని… సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.అసలు విషయం ఏంటి అంటే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అందుబాటులో లేడు.పైగా చిరంజీవి కూడా ప్రస్తుతం ఆరోగ్యపరమైన విషయాల కారణంగా సినిమా వాళ్లకు కొన్ని రోజులు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా వార్తలు రావడం చూస్తూ ఉంటే నిజం కాదని తేలిపోయింది.చిరంజీవి తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రావాలి అంటే ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి కొత్త దర్శకులు అయినా పర్వాలేదు కానీ కొత్త కథతో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి కోసం ఆ మధ్య ఒక యువ దర్శకుడు కథ చెప్పాడు.ఆ కథ నచ్చడంతో ఇప్పుడు దానిపై వర్క్ చేయాల్సిందిగా దర్శకుడికి సూచించినట్లుగా సమాచారం అందుతోంది.







