మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక గాడ్ ఫాదర్ సినిమాను కూడా దసరా సీజన్ లో విడుదల చేయడం కన్ఫర్మ్ అయ్యింది.
ఇప్పుడు అందరి దృష్టి కూడా భోల శంకర్ సినిమా పై ఉంది.అంచనాలు భారీగా ఉన్న ఈ మూడు సినిమాల కోసం భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మూడు సినిమాలు కూడా భారీ గా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆచార్య సినిమా నిరాశ పర్చినా కూడా ఈ మూడు సినిమాలు నిలిచి గెలుస్తాయని భావన అందరిలో కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భోళా శంకర్ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తారా లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తారా అంటూ మెగా ఫ్యాన్స్ లో చర్చ మొదలు అయ్యింది.
భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.కీర్తి సురేష్ ఈ సినిమా లో చిరు కు సోదరి పాత్ర లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ అనే విషయం తెల్సిందే.చిరంజీవి మరియు కీర్తి సురేష్ ల కాంబోలో ఉండే సన్నివేశాలు సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టిస్తాయి అంటున్నారు.
ఈ సినిమా ద్వారా దివి మెగా ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది.బిగ్ బాస్ ఫినాలే సమయంలో చిరంజీవి ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. భోళా శంకర్ విడుదల విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.