చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌' ఆ ఒక్కటి తప్పా అంతా పూర్తి

మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ని తెలుగు లో గాడ్ ఫాదర్ గా మెగా స్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

ఈ సినిమా లో కీలక పాత్ర లో సల్మాన్ ఖాన్‌ గెస్టు గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఆ విషయాన్ని యూనిట్‌ సభ్యులు కూడా దృవీకరించారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ చిత్రం షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ రెడీ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి.సల్మాన్ ఖాన్ ని హైదరాబాద్ తీసుకు రాకుండా చిత్ర యూనిట్ సభ్యులు స్వయంగా ముంబై కి వెళ్లారు అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.

సినిమా లోని కీలక సన్నివేశాల్లో సల్మాన్ ఖాన్‌ కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన సన్నివేశాలను ఆయన ఫాంహౌస్ లోనే చిత్రీకరించాలని నిర్ణయించారు.చిరంజీవి ఇప్పటికే అక్కడికి వెళ్లారు అనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ తో షూటింగ్ పూర్తి అయితే గాడ్ఫాదర్ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లే అంటూ తెలుస్తోంది.నయన తార ఈ సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతుందనే విషయం తెలిసిందే.

సత్య దేవ్‌ ఈ సినిమాలో కీలక పాత్ర లో కనిపించ బోతున్నాడు.మెగా స్టార్ చిరంజీవి మరియు నయనతార ల మద్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.

ఒరిజినల్‌ లూసీఫర్ కి చాలా మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.ఆచార్య సినిమా విడుదలైన అతి తక్కువ సమయం లోనే గాడ్ఫాదర్ సినిమా కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement