మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ తో చాలా ఆనందంగా కనిపిస్తున్నారు.ఆయన గత చిత్రం ఆచార్య నిరాశ పరిచిన నేపథ్యం లో చాలా ఆవేదన వ్యక్తం చేశారు, కానీ గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అయిన నేపథ్యం లో ఆనందం కు అవధులు లేకుండా పోయాయి అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.
బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ వారిని మీడియా వారిని కలుస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ గాడ్ ఫాదర్ సినిమా గురించి పదే పదే ఆనందం గా మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి ని చూస్తుంటే చాలా కొత్త గా అనిపిస్తున్నారని మొదటి సారి సక్సెస్ తక్కించుకున్న వాడిలా సంబర పడుతున్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో తరకెక్కి దసరా సందర్భం గా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది.ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయం లో ఇంకా కూడా భారీగానే కలెక్షన్స్ నమోదు అవుతున్న కారణంగా పెద్ద కమర్షియల్ హిట్ గా ఈ సినిమా నిలవబోతోంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి.అందులో భాగంగానే చిరంజీవి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఇక చిరంజీవి రాబోయే సినిమా ల విషయానికి వస్తే బాబీ దర్శకత్వం లో వాల్తేరు వీరన్న అనే సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి.
రవితేజ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సినిమా పై కూడా చాలా నమ్మకమే ఉంది.త్వరలో రాబోతున్న ఈరెండు సినిమాలతో హిట్ కొట్టి మరింత హ్యాపీగా చిరంజీవి ఉండే అవకాశం ఉంది.