రామ్ చరణ్ కు డాక్టరేట్.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ( Ram Charan ) నటించిన సినిమాలేవీ గతేడాది రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే.చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ( Vels University ) రామ్ చరణ్ కు ఇన్న గౌరవ డాక్టరేట్ అందించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

 Chiranjeevi Emotional Post About Ram Charan Success Details, Chiranjeevi, Ram Ch-TeluguStop.com

యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరు కావడంతో పాటు డాక్టరేట్ ను( Doctorate ) అందుకోవడం జరిగింది.రామ్ చరణ్ కళా రంగానికి విశేష సేవలు అందించడంతో ఆయనకు ఈ గౌరవం దక్కింది.

వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు డాక్టరేట్ వచ్చిందంటే మా అమ్మ నమ్మలేదని ఇంతమంది గ్రాడ్యుయేట్స్ మధ్యలో నిల్చోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ గౌరవం నా ఫ్యాన్స్, దర్శకనిర్మాతలదని నా తోటి నటీనటీనటులదని చరణ్ పేర్కొన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) కోసం శంకర్ చాలా కష్టపడ్డారని ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ తెలిపారు.

మరోవైపు రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ రావడంతో చిరంజీవి( Chiranjeevi ) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తండ్రిగా భావోద్వేగంగా ఉండటంతో పాటు చాలా గర్వంగా కూడా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఈ క్షణాలు ఎంతో ఎమోషన్స్ తో కూడినవని ఆయన కామెంట్లు చేశారు.

పిల్లలు సక్సెస్ సాధించడమే తల్లీదండ్రులకు నిజమైన ఆనందం అని చిరంజీవి వెల్లడించారు.

లవ్‌ యూ మై డియర్‌ డాక్టర్‌ రామ్‌చరణ్‌( Dr.Ram Charan ) అంటూ చిరంజీవి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇతర భాషల్లో సైతం రామ్ చరణ్ కు క్రేజ్ పెరుగుతుండగా చరణ్ తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube