మెగాస్టార్ లో ఆ జోరు కనిపించడం లేదు.. యంగ్‌ హీరోల మాదిరిగానే స్లో అండ్ స్టడీ

మెగాస్టార్‌ చిరంజీవి( Chiranjeevi ) రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో అంటే ఖైదీ నెం.150( Khaidi No.

150 ) సమయంలోనే ఏడాదికి రెండు మూడు సినిమా లు చేయాలి అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.సైరా నరసింహారెడ్డి సినిమా కారణంగా ఏడాది కి కనీసం ఒకటి కూడా విడుదల చేయలేక పోయాడు.

ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేయాలని భావించి కమిట్ అయ్యాడు.కానీ ఆచార్య సినిమా నిరాశ పరచడం తో కాస్త స్లో అయ్యాడు.

Chiranjeevi Dont Want To Do Back To Back Movies , Chiranjeevi ,khaidi No. 150

ఆ తర్వాత గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్ ( Bholaa Shankar )మరియు వాల్తేరు వీరయ్య సినిమా లను ఒకే సమయంలో ముందుకు తీసుకు వెళ్లాడు.అలా ఒకే సమయం లో మూడు సినిమా లు చేయడం వల్ల క్వాలిటీ పరంగా సరిగా ఉండటం లేదని భావించాడో ఏమో కానీ భోళా శంకర్ ఫలితం నేపథ్యం లో ఒకే సారి రెండు మూడు సినిమా లు చేయాలనే ఆలోచన తో చిరంజీవి లేడు అంటూ తేలిపోయింది.

Chiranjeevi Dont Want To Do Back To Back Movies , Chiranjeevi ,khaidi No. 150

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం వశిష్ఠ్ దర్శకత్వం లో చిరంజీవి ఒక సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తి అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )దర్శకత్వం లో లేదా మరో సినిమా లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.యంగ్‌ స్టార్‌ హీరోలు ఇప్పటికే ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు.

Advertisement
Chiranjeevi Don't Want To Do Back To Back Movies , Chiranjeevi ,Khaidi No. 150

కనుక ముందు ముందు చిరంజీవి కూడా ఒకటి చాలు అన్న సూత్రం తో సినిమా లు చేయబోతుంది.ఇండస్ట్రీ లో ముందు ముందు ఆయన సినిమా లు ఏడాదికి రెండు రావడం అంటే కష్టమే అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఒక్కటి వచ్చినా చాలు.క్వాలిటీ తో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఎంత వరకు అది సాధ్యమో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు