మెగాస్టార్ చిరంజీవి, మాస్‌మహారాజ రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాద్‌లో ద్విశతదినోత్సవ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గతకొన్నేండ్లుగా సినీపరిశ్రమను చుట్టుముడుతున్న రాజకీయాంశాలను ప్రస్తావించారు.
మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు.
పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు.అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.