టాలీవుడ్ స్టార్ చిరంజీవిపై గతంలో పలు సార్లు మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.వీరిద్దరి మద్య ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది.
అలాగే ఇద్దరు కూడా ఆదిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇలాంటి సమయంలో వీరిద్దరు అప్పుడప్పుడు కలవడం వారు ఆ సమయంలో మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు.
కాని ఈసారి మాత్రం చాలా క్లోజ్‌గా వీరిద్దరు కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
చిరంజీవి ముఖ్య అతిథిగా మా డైరీ ఆవిష్కరణ జరిగింది.
ఆ డైరీ ఆవిష్కరణలో మోహన్ బాబు కూడా పాల్గొన్నాడు.ఆ సమయంలోనే వీరిద్దరు కలిశారు.
సాదారణంగా మాట్లాడుకుంటే పెద్దగా చర్చ ఉండేది కాదు.కాని మోహన్‌బాబు పై చేయి వేసి మరీ చిరంజీవి ముద్దు పెట్టాడు.
ఇది కాస్త అతి అనిపించినా కూడా నమ్మలేక పోయినా కూడా ఇది నిజంగా జరిగింది.మోహన్‌బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం చర్చనీయాంశం అవుతుంది.
అయితే ఇది నిజమైన ప్రేమేనా లేదంటే ఫేకా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
.






