మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేస్తూ చాలా బిజీగా అనిపించారు.అయితే ఎక్కువ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ ఉండటంతో చేసేది లేక ఇక సినిమాలు మెల్లగా చేయాలని నిర్ణయించుకున్నాడు.
అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా ఒక సినిమా తర్వాత మరోటి అన్నట్లుగా కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు.భోళా శంకర్( Bhola Shankar ) సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన నేపథ్యం లో ఇప్పుడు బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం లో ఒక సినిమా ను చిరంజీవి చేయబోతున్నాడు.
ఇప్పటికే సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.ఎప్పుడెప్పడు సినిమా ను మొదలు పెడతారా అంటూ మెగా స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి వశిష్ఠ ( Chiranjeevi, Vasishta )మూవీ ని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.ఇక మారుతి సినిమా గురించి రెండు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.చాలా కాలం క్రితం చిరంజీవి ఒక వేదిక పై స్వయంగా మాట్లాడుతూ మారుతి దర్శకత్వం లో ఒక సినిమా ను చేయాలి అనుకుంటున్నట్లుగా ప్రకటించాడు.ఆ సినిమా కథ ఫైనల్ అయింది, వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ను పట్టాలెక్కించి వచ్చే ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా కొందరు తెగ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు చిరంజీవి మరియు మారుతి కాంబో సినిమా కథ చర్చ జరగలేదు.

అయితే చాలా వరకు సినిమా ఒక మంచి కమర్షియల్ పాయింట్ తో ఉంటుందని మాత్రం క్లారిటీ గా ఉంది.ఆ కమర్షియల్ పాయింట్ ను ఇప్పటికే చిరంజీవికి మారుతి చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగిందట.అందుకే చాలా వరకు చిరంజీవి మారుతి కాంబో మూవీ గురించి వస్తున్న వార్తల్లో కొంత నిజం ఉంటే కొంత అబద్దం ఉన్నట్లుగా మెగా కాంపౌండ్ కి చెందిన వారు అంటున్నారు.