ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈనెల 12వ తారీకున వీర సింహారెడ్డి సినిమా రాబోతుండగా ఒక్క రోజు తర్వాత అంటే జనవరి 13వ తారీకున మెగా స్టార్ చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే ఈ రెండు సినిమాలకు హీరోలు ఇద్దరు కూడా సాధ్యం అయినంత వరకు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమా కోసం యాంకర్ సుమ యొక్క టాక్ షో సుమ అడ్డ లో చిరంజీవి సందడి చేశాడు.ఆ షో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇక వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత వీర సింహారెడ్డి యొక్క ప్రమోషన్ కార్యక్రమాల కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని మరియు బాలయ్య కలిసి ఉదయ భాను తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఈ మధ్య కాలంలో ఉదయ భాను ఆశించిన స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోతుంది.బుల్లి తెరపై ఆమె యొక్క క్రేజ్ తగ్గినా కూడా ఆమెను అభిమానించే వారు చాలా మందే ఉన్నారు.బుల్లి తెరపై ఆమె యొక్క స్టామినాకు కొదవ లేదు.
అందుకే చాలా మంది ఇప్పటికి కూడా ఉదయ భాను షో లను ఇష్టపడుతున్నారు.అందుకే బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా కోసం ఆమెను రంగంలోకి దించారు.
ఆమెతో ఇంటర్వ్యూ చేసిన బాలయ్య సినిమా పై చాలా నమ్మకంగా కనిపించాడు.సంక్రాంతి సందర్బంగా ఈ షో ను టెలికాస్ట్ చేయబోతున్న విషయం తెల్సిందే.
చిరంజీవి మరియు బాలయ్య లు ఇలా పోటీ పడి మరీ ప్రమోషన్స్ లో పాల్గొంటే కచ్చితంగా సినిమా లు రెండు భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం.







