టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ ఉండడం వల్లే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి అనుకోవడం పెద్ద తప్పు.దిగ్గజ స్థాయిలో ఉన్న స్టార్ హీరోలు మల్టీస్టార్ర్ర్ చిత్రాలు చెయ్యడం, అవి కొన్ని సందర్భాలలో డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలవడం వంటివి కూడా జరిగాయి.
అలాంటి సినిమా గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము.ఆ చిత్రం పేరు ‘మెకానిక్ అల్లుడు’.
(
Mechanic Alludu ) మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) మరియు అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఇది.అప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ , ‘గ్యాంగ్ లీడర్’ వంటి వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలతో నెంబర్ 1 హీరో గా మారిపోయాడు.అలా వర్తమానం లో నెంబర్ గా కొనసాగుతున్న చిరంజీవి, ఇండస్ట్రీ కి రెండు కళ్లులాంటి వారిలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు తో కలిసి సినిమా చేస్తుండడం తో మూవీ పై అంచనాలు విడుదలకు ముందు నుండే భారీ స్థాయిలో ఉండేవి.

కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో ఈ చిత్రం విఫలం అయ్యింది.చిరంజీవి మరియు అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ వెండితెర మీద చూస్తున్నంతసేపు అభిమానులకు బాగా నచ్చింది.ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ స్క్రీన్ ప్లే తో చిత్రం గాడి తప్పింది.
ఫలితంగా ఆడియన్స్ కి ఈ సినిమా బాగా బోర్ అనిపించడం వల్ల , బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.అలా అభిమానులకు ఒక తీపి జ్ఞాపకం లాగ మిగిలిపోవాల్సిన ఈ చిత్రం, చేదు జ్ఞాపకం గా మిగిలింది.
అయితే కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి అప్పట్లో మంచి ఓపెనింగ్ దక్కింది.

అప్పటి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించిందట.కానీ అప్పట్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ చిత్రానికి దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరిగిందట చిరంజీవి మంచి ఫామ్ లో ఉండడం, నాగేశ్వరరావు లాంటి అగ్ర హీరో కూడా అందులో భాగం కావడం తో పాటుగా , హీరోలతో సరిసమానమైన ఇమేజి ఉన్న విజయశాంతి ( Vijayashanti ) హీరోయిన్ అవ్వడం, వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న బి.గోపాల్ దర్శకత్వం వహించడం, ఇంత పెద్ద కాంబినేషన్ కావడం తో బయ్యర్స్ కళ్ళు మూసుకొని ఈ సినిమాని కొనేశారు.బంపర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల నష్టం ఫుల్ రన్ లో వచ్చింది.

ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది.ముఖ్యంగా చిరంజీవి మరియు నాగేశ్వర రావు కాంబినేషన్ లో వచ్చే ‘గురువా గురువా’ అనే సాంగ్ అప్పట్లో పెద్ద హిట్.మెగాస్టార్ తో కలిసి హుషారుగా అక్కినేని నాగేశ్వర రావు స్టెప్పులు వెయ్యడం అప్పట్లో థియేటర్స్ బద్దలు అయ్యాయి.
కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయం లో డైరెక్టర్ కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయ్యేది.సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అప్పటికే చాలా పాతబడిపోయింది.
ఆ స్క్రీన్ ప్లే తో వచ్చిన సినిమాలన్నీ 1990 వ దశకం లో ఫ్లాప్స్ గా నిలిచాయి.ఆ కోవలోకే ‘మెకానిక్ అల్లుడు ‘ కూడా చేరిపోయింది.
ఈ చిత్రం విడుదలై నేటి తో 30 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ స్టోరీ ని అందించాము.