మెజారిటీ కోసమే ఈ ఎన్నికలు అంటూ చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!!

దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం ప్రచారంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ.

ప్రజల నుండి కూటమికి అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పుకొచ్చారు.వైసీపీని తాము ఎదురుకోవాల్సిన పనిలేదని.

ప్రజలే ఓడిస్తారని అన్నారు.తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వ్యాఖ్యానించారు.

జగనన్న కాలనీ ఓ పెద్ద మోసమని సంచలన వ్యాఖ్యలు చేశారు.వసతులు లేని స్థలాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు.

Advertisement

ఎన్నికలలో కూటమి ఆల్రెడీ గెలిచేసిందని.కేవలం మెజారిటీ కోసమే ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వంలో ప్రతి పథకం పేదలకు అందేలా చూస్తానన్నారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాగా పని చేస్తానని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో తాను ఓడిపోవడానికి కారణం ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారని వ్యాఖ్యానించారు.కానీ ఈ ప్రభుత్వంలో ప్రతిదీ సమస్యగా మారిందని స్పష్టం చేశారు.2009, 2014 ఎన్నికలలో చింతమనేని ప్రభాకర్ వరుసగా రెండుసార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచారు.2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో ఓడిపోయారు.దీంతో ఈసారి కచ్చితంగా గెలవాలని భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా 17 రోజులు మాత్రమే సమయం ఉంది.2014లో బీజేపీ.టీడీపీ.

జనసేన( BJP, TDP, Jana Sena ) మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి గెలవడం జరిగాయి.దీంతో మరోసారి గెలవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
పెళ్లిళ్ల సీజన్ వచ్చింది తులం బంగారం తూచేనా ? 

మరి ఈసారి ఎన్నికలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు