గోరంట్ల మాధవ్ పై సీరియస్ కామెంట్స్ చేసిన చింతకాయల విజయ్

మాధవ్.నీకు పగులుద్ద ఎంత ఎంపీ అయినా.

 Chintakayala Vijay Made Serious Comments On Gorantla Madhav ,chintakayala Vijay,-TeluguStop.com

చట్టం ముందు సామాన్యుడివే దిక్కుమాలిన పని చేసి మాపై నిందలేస్తావా.చింతకాయల విజయ్ పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.

గోరంట్ల మాధవ్ దిక్కుమాలిన పని చేసి దొరికిపోవడమే కాక.తెలుగుదేశం పార్టీ నేతలపై, మీడియాపై నిందలేయడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు.ఈ మేరకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.ఎంపీ మాధవ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తనకు సంబంధించిన వీడియో బయటకు తెచ్చింది నేనే అంటూ పేర్కొన్నారు.

అసలు ఆ వీడియోకు, నాకు ఏం సంబంధమో ఆయనే సమాధానం చెప్పాలి.ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నీతి, నిజాయితీ అనేవి లేవా.? ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వీడియోకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఏం సంబంధమో సమాధానం చెప్పాలి.ఒక పౌరుడిగా, కుటుంబంలోని వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా నీ కుటుంబానికి, ఓట్లేసిన ప్రజలకు, దేశానికి సమాధానం చెప్పడం పోయి.

నన్ను విమర్శించడమేంటి.? నీవు తప్పు చేయలేదని చెప్తే సరిపోతుందా.? ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తానని చెబుతున్నపుడు.ఆ పని చేయకుండా భయపడాల్సిన అవసరం ఏమిటి.

నీ సుందర ప్రతి బింభాన్ని చూసేందుకు ఎవరికీ అంత గుండె ధైర్యం లేదు మాధవ్.జిమ్ చేస్తున్న వీడియో చూపిస్తూ తోపు అంటున్నావ్.నువ్ జిమ్ చూడాల్సిన అవసరం మాకేంటి.? నీ విశ్వరూపం చూశాక ప్రజలు చీ కొడుతున్నారని తెలుసుకో.పార్లమెంటులో ఏపీ పరువు తీశారు.25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మీ నాయకుడు అంటే.జనం నమ్మి సీట్లిస్తే.మీరు చూపే ప్రత్యేక హోదా ఇదా.? ఇలాంటి న్యూడ్ వీడియోలేనా మీరు తెచ్చే స్పెషల్ స్టేటస్.? ఇదేనా సాధిస్తామన్న రైల్వే జోన్.? ఇవేనా వెనుకబడిన జిల్లాలకు తెస్తామన్న కేంద్ర నిధులుఇలా ఎన్నో సమస్యలుంటే.కనీసం పోరాటం చేయకుండా.

దిక్కుమాలిన పనులు చేస్తూ దరిద్రపు ఎంపీగా గుర్తింపు పొందారు.గతంలో కియా పరిశ్రమ ఎండీని బెదిరించారు.

పార్లమెంటులో రఘురామ రాజు లాంటి ఎంపీపై దాడికి దిగారు.పార్లమెంటులో మీసాలు తిప్పి, తొడలు కొట్టి పరువు తీశావు.

మిస్టర్ మాధవ్.నేనేంటో.నా చరిత్ర ఏంటో తెలుసా నీకు.? మొన్నటికి మొన్న నా తండ్రిని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు.ఇప్పుడు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ రోడ్డుపైకి లాగాలని ప్రయత్నిస్తున్నావు.ఒక పార్లమెంటు సభ్యుడిగా నిన్ను మేము టార్గెట్ చేయడానికి నీకున్న క్రెడిబిలిటీ ఏమిటి.? ప్రెస్ మీట్ పెట్టి మరీ నా పేరు చెప్పినందుకు తప్పకుండా పరువు నష్టం దావా వేస్తాను.పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాను.

పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించి, ప్రజలకు మేలు చేయడం కోసం నిన్ను ఎన్నుకుంటే.నువ్వేం చేస్తున్నావ్.? తెలుగుదేశం పార్టీ ఎంపీలను చూసి నేర్చుకో.మూడేళ్లుగా ఏపీ సమస్యలపై అలుపెరుగకుండా గళమెత్తి పోరాటం చేస్తున్నారు.

పార్లమెంటులో రాష్ట్రం కోసం పోరాటం చేయడం మాని, బట్టలన్నీ విప్పి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.తిరిగి మేం మార్ఫింగ్ చేశామంటూ నిందలేస్తావా.? నువ్వేమన్నా ప్రపంచం మెచ్చే అందగాడివా.? తెలుగు జాతి పరువును నాశనం చేసింది కాక.ఇంకా మాపై నిందలేస్తావా.? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైందని దేశ ప్రజలంతా జాతీయ జెండాను వాట్సప్ స్టేటస్ పెడుతుంటే.తెల్లారే సరికి నీ బూతు బాగోతం ఏంటయ్యా.? ఇంత దౌర్భాగ్యమైన పనులు చేస్తూ తిరిగి విమర్శలు చేస్తావా.? ఇంత జరుగుతున్నా.జగన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? ఫోరెన్సిక్ విచారణ చేయాలని మాధవ్ అడిగారు.ఆ మేరకు విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చి తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయండి.

మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వకపోగా.చనిపోయిన ఎన్టీఆర్ కుమార్తె మరణంపైనా నీచమైన రాజకీయం చేస్తున్నారు.ఎంతో నిబద్దతతో బతికిన వారిపై దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తారా.? ఇదేనా జగన్ రెడ్డీ నీ రాజకీయం.? ఇదేనా నీ విశ్వసనీయత.మీసం తిప్పావని, తొడ కొట్టావని నీకు జగన్ రెడ్డి నీకు ఎంపీ టికెట్ ఇచ్చాడు.

ప్రజలు పార్లమెంటుకు పంపించారు.అలాంటి నీవు ప్రజల సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించడం మాని, ఎంపీలను తిట్టడం, దాడులు చేయడం, ఇలాంటి నీచమైన పనులు చేయడానిక సిగ్గుందా.? జగన్ రెడ్డిపై, రాష్ట్ర పోలీసులపై చాలా నమ్మకం ఉంది.అందుకే.

ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతాం.తప్పు చేస్తే తల తీసేసుకుంటామని మాధవ్ మాటలు హాస్యాస్పదంగా ఉంది.

ఒక ఎంపీగా ఉండి నీవు ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినపుడు.సిగ్గుపడి బాధ్యతగా రాజీనామా చేసి, ఆ వీడియో నీది కాదు అని రుజువైన తర్వాతే పార్లమెంటుకు వస్తానని చెప్పాలి.

అంతేగానీ.మేము చేశామంటూ మాపై నిందలు వేయడానికి కాస్తైనా సిగ్గు ఉండాలి.

మిస్టర్ ఎంపీ మాధవ్.మేమేం పిచ్చోళ్లం కాదు.

భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ప్రసాదించిన హక్కుల ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.అంతే గానీ నీలా బూతు వీడియోలు చేయడానికి కాదు అని గుర్తుంచుకో.

వైసీపీ అనేది రాజకీయ పార్టీనో.రాసలీలల పార్టీయో అర్ధం కావడం లేదు.

ఒకడేమో అరగంట కావాలంటాడు.మరొకడేమో అన్నీ చేస్తుందా.

కొన్నే చేస్తుందా అంటాడు.ఆడియోలు బయట పడితే అవి నావి కాదు అంటాడు.

అతనికే మంత్రి పదవి ఇచ్చారు.నీవు చేసిన ఘన కార్యానికి జగన్ రెడ్డి ఇంకే పెద్ద పదవి ఇచ్చి నిన్ను సత్కరిస్తారో అని భయమేస్తోంది.

ఎంపీగా ఉన్నాను.ఎవరేం చేస్తారు అని విర్రవీగుతున్నావు.కానీ.నీవు భారత రాజ్యాంగం, చట్టం ముందు సామాన్యుడివే అని గుర్తు పెట్టుకో.

మేము చట్టపరంగా పోరాటం చేస్తాం.నీవు ఎవడో ఎవరికీ తెలియదు.

అలాంటి నీ వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.? ఒక వేళ అలా చేయాలనుకున్నా.అందుకోసం చేసిన ఖర్చు కూడా వృథా అని తెలుసుకో.కేంద్ర ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ ద్వారా విచారణ జరపాల్సిందిగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాస్తాం.మాపై అనవసర నిందలేసిన నీకు తప్పకుండా పగులుద్దని హెచ్చరిస్తున్నాం.మాపై విమర్శలు చేసే ముందు నీవేంటో, నీ ఆత్మ సాక్షిని ప్రశ్నించుకో.

నిజంగా నీవు సచ్చీలుడివే అయితే.ముందు పదవికి రాజీనామా చేసి తప్పు చేయలేదని నిరూపణ అయ్యాక తిరిగి పార్లమెంటుకు వెళ్లాలి అని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube