ఈ హీరో తన ఆస్తి మొత్తం ట్రస్ట్ కి రాసేశాడంట.. తన కొడుకు కి మాత్రం...

హాలీవుడ్ లో పలు యాక్షన్ చిత్రాలలో మరియు మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన చిత్రాలలో హీరోగా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ "జాకీ చాన్" గురించి తెలియనివారుండరు.

అయితే జాకీ చాన్ చిత్రాలకి దేశంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

దీంతో జాకీ చాన్ చిత్రాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ భాషలలో డబ్బింగ్ చెప్పి అన్ని దేశాలలోనూ విడుదల చేస్తారు.అయితే తాజాగా నటుడు జాకీ చాన్ తన ఆస్తులకు సంబంధించి ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో తన మరణాంతరం తనకు సంబంధించిన ఆస్తులలో ఒక రూపాయి కూడా తన సంతానానికి చెందకుండా అనాధ శరణాలయాలకి మరియు ఇతర ట్రస్టులకి రాసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అంతేగాక ఆ మధ్య ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి చర్చిస్తూ ఇంటర్వ్యూ చేసే యాంకర్ తన సంతానానికి ఆస్తులు చెందకుండా ఎందుకు ఇతర ట్రస్తులకి రాశారని ప్రశ్నించింది.

దీంతో జాకీ చాన్ ఈ విషయంపై స్పందిస్తూ తన కొడుకు సమర్ధుడైతే తనకి తానుగా సంపాదించుకుంటాడని అలా కాకుండా అసమర్థుడయితే తన డబ్బుని వేస్ట్ చేస్తాడని అలాంటప్పుడు ఎవరికి ఉపయోగం ఉండదని తెలిపాడు.అంతేకాక ప్రజలు తన చిత్రాలను ఇంతగా ఆదరించడం వల్లే తాను ఇన్ని ఆస్తులు కూడ బెట్టానని అలాంటప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా తిరిగి ఇచ్చేయడంలో తప్పేముందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

దీంతో జాకీ చాన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా యాక్షన్ హీరో జాకీ చాన్ తనయుడు జైసీ చాన్ కూడా హాలీవుడ్ లో హీరోగా నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.కాగా సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా తన తదనంతరం తన ఆస్తులు మరియు డబ్బు అన్నీ కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించాలని గతంలో ప్రకటన చేశాడు.

Advertisement

తాజా వార్తలు