కార్ పార్కింగ్ కోసం చైనాలో సరికొత్త పరికరం.. కష్టాలు తీరినట్లే!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం బాగా పెరిగిపోతోంది.సిటీలలో కార్ల పార్కింగ్( Car Parking ) పెద్ద సమస్యగా మారుతోంది.

అయితే ఇలాంటి సమస్యకు చైనా చెక్ పెట్టింది.ఆటోమేటిక్ వాలెట్ పార్కింగ్( Automatic Valet Parking ) చేయడానికి సరికొత్త ఏఐ టెక్నాలజీతో కూడిన రోబోను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.పార్కింగ్ చేయడానికి కొందరు ఇబ్బంది పడుతుంటారు.

నిర్దేశించిన స్థలంలో కాకుండా అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తుంటారు.ఫలితంగా ఇతరులు పార్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది.

Advertisement

ఇలాంటి సమస్యలకు చైనాలో( China ) రూపొందించిన ఆటోమేటెడ్ వాలెట్ పార్కింగ్ రోబో చెక్ పెడుతోంది.దీనిని ఎవరైనా సులభంగా వినియోగించవచ్చు.

చైనాలో చకచకా కార్లు పార్కింగ్ చేస్తున్న పరికరానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.ఆటోమేటెడ్ వాలెట్ పార్కింగ్ రోబో ద్వారా నిర్దేశించబడిన డ్రాప్-ఆఫ్ పాయింట్ వద్ద దిగిన మొబైల్ యాప్ సాయంతో కారును పార్కింగ్ చేయొచ్చు.

అది మాన్యువల్ ఆపరేషన్, పర్యవేక్షణ లేకుండా పార్కింగ్ స్పాట్‌కు( Parking Spot ) స్వయంగా డ్రైవ్ చేస్తుంది.వినియోగదారు యాప్‌లో పిక్ అప్ సూచనను అందిస్తే చాలు.

అలా ఆ కారు ఆటోమేటిక్‌గా నిర్దేశించిన పిక్-అప్ పాయింట్‌కి వెళుతుంది; అనేక కార్లు ఒకే సమయంలో పార్కింగ్ సూచనలను స్వీకరిస్తే, అవి ఆటోమేటిక్‌గా పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉంటాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
కేవలం రెండు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిన ఇంజనీర్.. వీడియో చూస్తే..

ఇదే కాకుండా ప్రస్తుతం మాన్యువల్‌గా ఆపరేట్ చేసుకునేలా సరికొత్త రోబో సిస్టమ్( Robot ) ప్రస్తుతం అమల్లోకి వచ్చింది.రద్దీ రోడ్లలో సైతం కార్లను దీని సాయంతో సులువుగా పార్కింగ్ చేయొచ్చు.నిర్దేశిత స్థలంలో కరెక్ట్‌గా దీనిని చేర్చవచ్చు.

Advertisement

ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు.వాహనాలను సైతం చక్కగా నిర్దేశిత స్థలంలో పార్కింగ్ చేసే వీలుంటుంది.

దీనికి సంబంధించిన వీడియోను @Rainmaker1973 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.చైనీయులు చాలా వస్తువులు, పరికరాలు తయారు చేస్తున్నారని, వారి తెలివి అమోఘమని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఈ సరికొత్త ఆటోమేటెడ్ వాలెట్ పార్కింగ్ రోబోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు