ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రమాదంలో పడుతున్న పిల్లలు.. స్కూళ్లు తెరిస్తే ఏం జరుగుతుంది.. ??

కరోనా విద్యార్ధుల జీవితాలతో నిర్ధాక్షిణ్యంగా ఆడుకుంటుంది.

ప్రస్తుతం పిల్లలు, వారి తల్లిదండ్రుల పరిస్దితి ఎలా ఉందంటే స్కూళ్లకు పంపిస్తే ఒక బాధ, అలాగని ఇంట్లో ఉంటే మరో బాధ.

ఇలాంటి సమయంలో విద్యార్ధుల తల్లిదండ్రులకు ఆందోళనే మిగులుతుందట.ఇదిలా ఉండగా జూలై 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Children At Risk Due To Government Decisions, Telanagana, AP, Govt Decisions, Ch

ఈ సమయంలో కరోనా సెకండ్ వేవ్ గురించి గుర్తు తెచ్చుకుంటే ఒంట్లో వణుకు పుడుతుంది.ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు.

అందువల్ల స్కూళ్ల ప్రారంభాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందట.త్వరలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ కరోనా థర్డ్ వేవ్ వస్తున్నా అని ఫోన్ చేసి చెప్పిందా అని వ్యంగ్యాస్త్రాలు వదిలి విమర్శకుల నోళ్లు తెరిచేలా చేశారు.

Advertisement

గతంలో కూడా కరోనా లేదు గిరోనా లేదు.పారాసిట్మల్ వేస్తే తక్కువ అయిపోతుందని చేసిన వాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే.అందుకే గతాన్ని గుర్తుచేసుకుని స్కూళ్ల ఓపెన్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తే మంచిదని, ఒకవేళ కాదని స్కూళ్లు, కాలేజీలు ఒపెన్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫేషియ‌ల్ చేసుకోండి!
Advertisement

తాజా వార్తలు