పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట( Chilakaluripet )లో ఎన్డీఏ నిర్వహించే సభకు ‘ప్రజాగళం’ అనే పేరు ఖరారు అయింది.ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ – బీజేపీ -జనసేన సంయుక్తంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) పాల్గొనే ఈ సభను పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.కాగా ఈ సభకు పల్నాడు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రవాణా సదుపాయాలతో పాటు ఇతర ఏర్పాట్ల నిర్వహణకు గానూ సుమారు ఇరవై కమిటీలను బీజేపీ నాయకత్వం ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా సభా వేదికపై నుంచి క్లియర్ గా చెప్పాలని మూడు పార్టీల అధినేతలు యోచనలో ఉన్నారని సమాచారం.
.






