క్యాంపు కార్యాలయంలో రాజాం నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ.

ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమైన కార్యకర్తలను కలుస్తున్నాను దీంట్లో భాగంగా రాజాం నియోజకవర్గం కార్యకర్తలనూ కలుస్తున్నాను: గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించండి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మనం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలి మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.ఈసారి మరింతపెరగాలి:

 Chief Minister Ys Jagan Met Party Workers From Rajam Constituency In The Camp Of-TeluguStop.com

రాజాం నియోజకవర్గానికి సంబంధించి కేవలం డీబీటీ కిందే రూ.775 కోట్లు ఇచ్చాం ప్రతి ఇంటికీ వారివారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నాం ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆ శీర్వదించండి అని ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతున్నాం మంచి చేసిన తర్వాతనే మనం ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడుగుతున్నాం ఈ నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం: వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నాం వీటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది ఇలా మంచి చేసిన తర్వాతనే ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడిగే కార్యక్రమాన్ని చేస్తున్నాం:

ప్రతి ఎమ్మెల్యే, కార్యకర్తా ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్లాలంటే.ధైర్యంగా వెళ్లే పరిస్థితి అని నాన్నగారి హయాంలో అనేవాళ్లు ఇల్లు, రేషన్‌కార్డు, పెన్షన్‌.

ఇలా ఏది అడిగితే అది ఇచ్చాం అప్పటి పాలన గురించి ఆరోజుల్లో చెప్పేవారు పలానాది ఇవ్వలేదూ అని చెప్పే పరిస్థితి లేదు సంతృప్తస్థాయిలో అర్హత ఉన్న ఏ ఒక్కరికీ కూడా నిరాకరించకుండా నాన్నగారి హయాంలో ఇచ్చారు ఈరోజు అదే నిజాయితీతో, అదే అంకిత భావంతో మనం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం అర్హత ఉండీ రాని పరిస్థితి లేదు ఇక మనం చేయాల్సింది.చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవాలి: దీనికి కార్యకర్తలుగా మీ కృషి ఎంతో అవసరం పార్టీపరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి దాదాపు 24 అనుబంధ విభాగాలు మనకుఉన్నాయి: ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి: ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి: బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి:

వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి, మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడాలి ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మను బాగా చూసుకుంటే కుటుంబాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి పథకంకూడా అక్కచెల్లె్మమ్మ పేరుతోనే పెట్టాం అందుకే వీరిని భాగస్వామ్యంచేయాలి: సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతాపనులకు మంజూరుకూడా చేస్తున్నాం మళ్లీ మనం అఖండ మెజార్టీతో గెలవాలి ఈసారి మన టార్గెట్‌ 151 కాదు, 175 కి 175 సీట్లలో గెలుపు సాధించాలన్నది మన టార్గెట్‌ ఈ టార్గెట్‌ కష్టంకాదు.మీ నియోజకవర్గంలో ఏమేర లబ్ధి జరిగిందో, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగింది 87శాతం కుటుంబాలకు పథకాలు అందాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘనవిజయాలు సాధించాం మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాం ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అంతకుముందు ప్రజలకు ఏదైనా అందాలంటే.పది మంది చుట్టూ తిరగాలి, తిరగాలి లంచాలు ఇచ్చుకోవాలి

ఇంతచేసినా ఊర్లో వేయి మంది ఉంటే నలుగురికో, పదిమందికో అందేవి ఇప్పుడు ఆ అవసరం లేదు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజలకు అందుతున్నాయి గతంలో సచివాలయ వ్యవస్థ అనేదే లేదు నాలుగు అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి, నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి, నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి నేడు గ్రామాల్లో ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఉంది విద్య, వ్యవసాయం, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం: ఆరోగ్యశ్రీ కింద 3వేలకుపైగా చికిత్సలకు వర్తింపు చేస్తున్నాం మన గ్రామంలోనే మన కళ్లముందే మార్పులు కనిపిస్తున్నాయి ప్రజలకు ఇవన్నీకూడా చెప్పాలి, వారి మద్దతును తీసుకోవాలి:మీతోడు జగన్‌కు కావాలి మనం అంతా ఇంకా 30 సంవత్సరాలు కలిసికట్టుగా రాజకీయాలు చేయాలి:జీవితంకాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలి: మన తీసుకొచ్చిన మార్పులు అన్నీకూడా మన కళ్లముందే ఫలితాలను ఇస్తాయి ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube