హైదరాబాద్‌కు మణిహారంగా చెప్పుకుంటున్న శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా జనాలతో రోడ్లు చాలా బిజీగా ఉంటాయి.అలాంటి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక చిరుత పులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.
గత వారం రోజులుగా పలు సార్లు జనాలకు ఆ చిరుత పులి కనిపించిందని, ఆ చిరుత పులి స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆ చిరుత పులి కోసం అటవి సంరక్షణ అధికారులు వేట ప్రారంభించారు.
చిరుత పులిని పట్టుకుని అడవికి లేదా జూకు తీసుకు వెళ్లేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే మరి కొందరు శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు చిరుత వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ కొందరు అంటున్నారు.
ఒక వ్యక్తి తీసిన వీడియో ఆధారంగా ఈ ప్రచారం మొదలైంది.ఆ వీడియో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనిదేనా కాదా అనేది ప్రస్తుతం నిర్థారించేందుకు అటవి శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.