వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ కు( NDA ) చెక్ పెట్టాలని విపక్షాలన్నీ ఏకం అయిన సంగతి తెలిసిందే.తాజాగా విపక్ష కూటమికి INDIA అని పేరు కూడా పెట్టారు.
జాతీయ రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఎన్డీయే కూటమికి యూపీఏ కూటమి( UPA ) ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూ వచ్చింది.కానీ ఇప్పుడు యూపీఏ కాస్త INDIA గా మారిపోయింది.
INDIA అనగా ఇండియన్ నేషనల్ డెవెలప్మెంటల్ ఇన్క్లుసివ్ అలియెన్స్. గత కొన్నాళ్లుగా విపక్షాల ఐక్యత కోసం ఆయా పార్టీల జాతీయ అగ్రనేతలు గట్టి ప్రయత్నలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితిశ్ కుమార్, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.ఇలా చాలమంది జాతీయ పొత్తు కోసం అరతపడుతూ వచ్చారు.

ఎట్టకేలకు అన్నీ పార్టీలు ఏకమై ” INDIA ” కూటమి గా ఏర్పడ్డాయి.మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా కూటమి ఎన్డీయే కు ఎంతవరుకు పోటీనిస్తుంది.అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది.INDIA లో ప్రస్తుతం 26 పార్టీలు అధికారిక సభ్యత్వం కలిగి ఉన్నాయి.కాంగ్రెస్ ఈ 26 పార్టీలకు గాను దాదాపు 200 పైచిలుకు సీట్లు విపక్షాల కూటమి చేతిలో ఉన్నట్లే.కానీ INDIA ప్రత్యర్థి కూటమి అయిన ఎన్డీయే లో 36 పార్టీలు సభ్యత్వం ఉండగా.300 పైచిలుకు సీట్లు ఎన్డీయే అధీనంలో ఉన్నాయి.దాంతో ఎన్డీయే కూటమికి చెక్ పెట్టడం విపక్షలకు అంతా తేలికైయన విషయం కాదు.
ఎన్డీయే కు చెక్ పెట్టలంటే రాష్ట్రాల వారీగా విపక్ష పార్టీలు( Opposition Parties ) బలం పెంచుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా బీజేపీ( BJP ) వ్యూహాలను దెబ్బకొట్టి ప్రజల్లో విపక్షాలపై ఆధారణ పెంచుకునేలా చేయాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతం విపక్ష కూటమి వ్యూహాలు చూస్తుంటే.ఎన్డీయేకు గట్టిగానే దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా దేశ ప్రజలు ఆకర్షితులు అయ్యే విధంగా కూటమికి ” INDIA ” అని పేరు పెట్టడం.దీంతో ప్రజల్లో ఇండియా వర్సస్ ఎన్డీయే భావనా కలిగేలా చేయాలనేది విపక్షాల ప్లాన్ గా తెలుస్తోంది.
దేశ ప్రజల్లో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ” INDIA ” వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే బీజేపీ గాని బీజేపీ మిత్రాపక్షాలు పక్షాలు గాని విపక్షలను విమర్శించే క్రమంలో INDIA ప్రస్తావన తీసుకురావాల్సి ఉంటుంది.
అప్పుడు ప్రజల్లో ఎన్డీయే పై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది.ఈవిధంగా దేశ ప్రజల సెంటిమెంట్ ను వాడుకోని ఎన్డీయే కు చెక్ పెట్టాలని విపక్షాలు “INDIA ” గా ఏర్పడ్డాయి.
మరి విపక్షాల ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.