దేశంలో తక్కువ ధరకు లభించే ఆటోమేటిక్ కార్లు ఇవే.. వీటి ప్రత్యేకతలు తెలుసా?

వాహనదారులకు ఆటోమేటిక్ కార్లు( Automatic Cars ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సాధారణంగా ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆటోమేటిక్ కారు డ్రైవింగ్ అనేది చాలా అనుకూలం అని చెబుతూ వుంటారు.

 Cheapest Automatic Cars Available In Indian Market Details, Cheapest Automatic C-TeluguStop.com

ముఖ్యమైన విషయం ఏమంటే, మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లు నడపడం చాలా తేలిక.ఎందుకంటే ఇక్కడ డ్రైవర్ గేర్లు మార్చడం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

అవసరమైనప్పుడు కారు ఆటోమేటిక్‌గా గేర్‌లను మార్చుకుంటూ పోతుంది.అయితే మ్యాన్యువల్ కార్లతో పోలిస్తే ఆటోమేటిక్ కార్ల ధర కనీసం రూ.50-60 వేలు ఎక్కువగా ఉంటుంది.

ఈ నేపధ్యంలో దేశంలోని 5 చౌకైన ఆటోమేటిక్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఈ లిస్టులో మొదటిది “మారుతి సుజుకి ఆల్టో కె10”( Maruti Suzuki Alto K10 ) ఇది యావత్ దేశంలోనే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగిన అత్యంత చౌకైన కారు.ఆల్టో కె10 ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది.మాన్యువల్, ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్ దీని ప్రత్యేకత.

Telugu Automatic Cars, Cars, Indian, Marutisuzuki, Renault Kwid, Tata Tiago-Late

ఇక 2వ కారు “మారుతి సుజుకి S-ప్రెస్సో.”( Maruti Suzuki S-Presso ) దీని రూపం ఆల్టో కె10ని పోలి ఉంటాయి.దీని ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.ఇది 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్‌తో కూడా వస్తుంది.ఈ లిస్టులో 3వ కారు పేరు “రెనాల్ట్ క్విడ్.”( Renault Kwid ) ఇది దేశంలోనే కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారుగా పేరుగాంచింది.దీని ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ.6.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Telugu Automatic Cars, Cars, Indian, Marutisuzuki, Renault Kwid, Tata Tiago-Late

ఈ లిస్టులో నాల్గవ కారు “మారుతి సుజుకి వ్యాగన్ఆర్.”( Maruti Suzuki Wagon R ) మారుతి వ్యాగన్ఆర్ దాదాపు రెండు దశాబ్దాలుగా మార్కెట్‌ను శాసిస్తున్నదని చెప్పుకోవచ్చు.ఈ కారులో 5-స్పీడ్ MT/ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్ కలదు.ధర రూ.6.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.ఇక ఈ లిస్టులో చిరగా చెప్పుకోబోయే కారు పేరు “టాటా టియాగో.”( Tata Tiago ) దీని ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ.6.92 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి.ఇది 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ (84bhp, 113Nm)తో 5-స్పీడ్ MT/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube