చత్రపతి చైల్డ్ ఆర్టిస్ట్ మనోజ్ జీవితంలో.. ఇంత విషాదం జరిగిందా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది బాలనటులు ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా పాత్రలో ఒదిగిపోయి నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నా వారిలో మనోజ్ నందం కూడా ఒకడు.

 Chatrapathi Manoj Struggles In Real Life Details, Chatrapathi Child Artist, Chil-TeluguStop.com

అతడు, ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోల చిన్నప్పటి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.తరువాత హీరోగా మారి ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అంటూ ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా కమర్షియల్గా హిట్ కాకపోయినప్పటికీ మనోజ్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకు తిరుగు లేదు అని నిరూపించిన మనోజ్ హీరోగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు అని చెప్పాలి.

ఈ క్రమంలోనే చిన్నా చితకా సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు సైడ్ క్యారెక్టర్లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఇక ఇప్పుడు తమిళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం అనే సినిమాలో ఆర్మీ మెన్ గా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ తన లైఫ్లో జరిగిన విషాదకర ఘటన గురించి చెప్పుకొచ్చాడు.

మనోజ్ తల్లి 2015లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతిచెందారు.

అయితే 2012లో ఇక తన తల్లికి క్యాన్సర్ వుంది అనే విషయం తేలింది.

Telugu Manoj, Manoj Nandam, Manojnandam, Sitramam-Movie

ఈ క్రమంలోనే డబ్బులు చాలా అవసరం అయ్యాయి.అయితే ఆ సమయంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా సినిమా చేశాను.సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లిని బతికించుకోవాలి అని ఆశ పడ్డాను.

అయితే అదే సమయంలో మా నాన్నకి కూడా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.ఇలా పూర్తిగా కుటుంబం మొత్తం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

నాకు తెలిసిన పని నటించడం మాత్రమే.ఇక ఏ అవకాశం వచ్చినా కాదనకుండా చేసి డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయిపోయాను.

కానీ ఎంత ఖర్చు పెట్టినా అమ్మని మాత్రం దక్కించుకోలేక పోయాను అంటూ మనసులో ఉన్న బాధను బయటపెట్టాడు మనోజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube