సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి,విడాకులు ఇవన్నీ కామన్.చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని ఏళ్లపాటు కూడా కలిసి ఉండక ముందే వెంటనే విడాకులు తీసుకున్న విడిపోయిన వారు చాలామంది ఉన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్లి విషయం వచ్చేసరికి మొహం చాటేసిన వారు కూడా చాలామంది ఉన్నారు.ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోవడం మరొకరితో డేటింగ్ చేయడం అన్నది ఇండస్ట్రీలో సర్వసాధారణం.
అయితే సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా విడాకులకు గల కారణం ఏంటి అంటే సర్దుకుపోయే గుణం లేకపోవడం అని చెప్పవచ్చు.
భార్య భర్తలు ఇద్దరూ అంగీకారంతోనే విడిపోయి ఆ తర్వాత సమయం సందర్భాలలో కలుస్తున్నారు.
చాలామంది సెలబ్రిటీలు వారి పిల్లల విషయంలో కూడా కలుస్తున్నారు అని చెప్పవచ్చు.ఇంకొందరు పెళ్లి తర్వాత కనీసం ఏడాది కూడా కలిసి కాపురం చేయకముందే విడాకులు తీసుకుని విడిపోతున్నారు సెలబ్రిటీలు.
అయితే సెలబ్రిటీల విడాకులు అభిమానులను ఎంతగానో బాధిస్తోంది.అన్యోన్యంగా ఉంటున్నారు అనుకుంటున్న సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోవడంతో ఆ వార్తలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కొందరు చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుని విడిపోతుండగా కొందరు వ్యక్తిగత కారణాల వల్ల విధాలు తీసుకొని విడిపోతున్నారు.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.ఒక బుల్లితెర నటి కూడా విడాకులు తీసుకుంది.మరి ఆ జంట ఎవరు అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాలీవుడ్ బుల్లితెర నటి అసోపా చారు( Actress Asopa Charu ), బాలీవుడ్ నటి సుష్మీతా సేన్( Sushmita Sen ) సోదరుడు రాజీవ్ సేన్( Rajiv Sen ) గతంలో కూడా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.అయితే ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ చివరకూ విడిపోవడానికే ఆసక్తి చూపారు.
వీరిద్దరి మధ్య తేడాలు రావడం అనేది తప్పు చేసింది నువ్వు అని నువ్వు తప్పు చేసావని మరొకరు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతే కానీ వీళిద్దరి మధ్య పెద్దగా విడిపోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవని తెలుస్తోంది.
అలా ఈ జంట మనస్పర్థలతో గతేడాది డిసెంబరు నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు.అయితే తాజాగా కోర్టు ఈ జంటకు విడాకులకు ఒకే చెప్పేసింది.దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా చట్టం ప్రకారంగా విడాకులు తీసుకున్నారు.అయితే గతంలో తన కూతురు కోసం స్నేహాపూర్వకంగా ఉందామని అనుకున్నారు.అయితే ఈ విషయాన్ని కూడా రాజీవ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో చెప్పుకున్నాడు.ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ రాసుకున్నాడు రాజీవ్ సేన్.
మేము విడిపోయినా కూడా మా ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది.మేము ఎల్లప్పుడే మా కూతురికి అమ్మ, నాన్నలాగానే ఉంటాం అంటూ కాస్త ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.
అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ అభిమానులు మండిపడుతున్నారు.విడాకులు తీసుకోవడం ఎందుకు ఇలా బాధపడటం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా 2019 జూన్ 9న ఈ జంట గోవాలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.సరిగ్గా నేటికీ ఈ జంట పెళ్లి చేసుకుని దాదాపు నాలుగు ఏళ్ళు పూర్తి అయ్యింది.
కరెక్ట్ గా పెళ్లి అయిన తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులను కలిచివేస్తోంది.