అర్ధరాత్రి అయినా సరే ఓకే అంటుందట.. ఛార్మీ మామూల్ది కాదు

టాలీవుడ్ ఇండస్ట్రీలో  హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి గురించి అందరికీ తెలిసిందే.

తన నటనతో, అందంతో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించు కుంది.

ఒకప్పుడు హీరోయిన్ గా నటించగా గత కొన్ని రోజులుగా ఆ స్థానాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.నిజానికి ఈమె హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలలో మాత్రమే నటించింది.ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే హీరోయిన్ గా అడుగు పెట్టింది.2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది.కానీ ఈ సినిమా అంతా సక్సెస్ కాలేక పోయింది.

ఆ తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో నటించింది.ఈ సినిమాలో తన అందాలను కూడా ఆరబోసింది.

ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది.ఆ తర్వాత మాస్, చక్రం, పౌర్ణమి, రాఖి, జ్యోతిలక్ష్మి, మంత్ర వంటి పలు సినిమాలలో నటించి మంచి హిట్ ను అందుకుంది.

Advertisement
Charmi Late Night Ice Cream Party With Friend Viral Details, Charmi, Tollywood,

ఇక జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత సినిమాలకు దూరం అయింది.అది కూడా హీరోయిన్ గా మాత్రమే.

జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది.దాంతో తను ఆయన సహాయంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

అలా పూరి జగన్నాథ్ రూపొందించే ప్రతి ఒక్క సినిమాలకు తానే నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

Charmi Late Night Ice Cream Party With Friend Viral Details, Charmi, Tollywood,

గతంలో వీరిద్దరి సన్నిహితం చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు కూడా వినిపించాయి.కానీ వీరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని తామే స్వయంగా తెలిపారు.నిజానికి ఈ అమ్మడికి జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఏ సినిమాలో కూడా అవకాశాలు రాలేదు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

అలా రాకపోవడానికి కారణం మరొకటుంది.అది ఏంటో కాదు తాను వరుసగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కారణమని తెలుస్తుంది.

Charmi Late Night Ice Cream Party With Friend Viral Details, Charmi, Tollywood,
Advertisement

పలు సినిమాలలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో ముందుకు రావడంతో ఆమెను మళ్లీ హీరోయిన్ గా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు.కానీ నిర్మాతగా బాగా సంపాదిస్తుంది ఛార్మి.ప్రస్తుతం పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉంది.

ఇక ఛార్మి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచు కుంటుంది.

అంతే కాకుండా సినిమా అప్ డేట్ లను కూడా బాగా షేర్ చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో చిల్ చేసిన ఫోటోలను కూడా తెగ పంచు కుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా జితెన్ శర్మ అనే తన స్నేహితుడు తనతో దిగిన ఫోటోలను పంచు కున్నాడు.అందులో తామిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ కనిపించగా అది అర్ధరాత్రి సమయమని అర్థమవుతుంది.

ఇక అతడు ఆ ఫోటోకు తను ఎప్పుడు ఐస్ క్రీమ్ అడిగిన కాదనకుండా అర్థరాత్రి అయినా సరే ఓకే అంటుందని తెలిపాడు.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఛార్మి మామూలుది కాదు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు