షూస్ తో మొబైల్ కి ఛార్జింగ్..ఈ విద్యార్థి మేధస్సుకు హాట్సాఫ్..!

దేశ భవిష్యత్తులో కీలక మార్పు యువతతోనే సాధ్యం.యువత తలచుకుంటే దేశ తలరాత సైతం మారక తప్పదు.

 Charging Mobile With Shoes  Hotsoff For This Student's Intelligence , Charging M-TeluguStop.com

భారతదేశంలో విద్యార్థులు అక్కడక్కడ వివిధ రకాల ప్రయోగాలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ యువకుడు మేధాశక్తికి హ్యాట్సాప్ చెప్పడం కూడా తక్కువే.

ఏకంగా షూస్ నుండి మొబైల్ ఛార్జింగ్( Mobile charging ) పెట్టుకునే విధానాన్ని తయారు చేశాడు.కేవలం విద్యార్థుల చదువు పుస్తకాలకు పరిమితం కాకుండా.

ప్రయోగాల ద్వారా చదివితే విద్యార్థుల కొత్త కొత్త నైపుణ్యాలు బయటికి వస్తాయి.ప్రయోగాత్మకమైన చదువు విద్యార్థుల మేధాశక్తిని ఆలోచింపచేసి రెట్టింపు చేస్తుంది అనేదానికి ఈ విద్యార్థి ఓ ఉదాహరణ.

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలోని కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో 2023 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజినల్ స్థాయి సైన్స్ పోటీలు నిర్వహించారు.

Telugu Drmuthu, Yana Shukla, Latest Telugu, Shoes Lace, Intelligence-Technology

ఈ కార్యక్రమానికి వింధ్యాచల్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ ముత్తు కుమార్ స్వామి( Dr.Muthu Kumar Swamy ), జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కామ్తా రాంపాల్ లు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.వినూతమైన ఆలోచనలతో దేశానికి ముందుకు నడిపించే సామర్థ్యం ఒక్క విద్యార్థులకే సాధ్యం అని అభిప్రాయపడ్డారు.

ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులు తయారుచేసిన ఎలక్ట్రో గన్, యాంటీ స్మాగ్ గన్, ఫెర్టిలైజర్ మిషన్, ఎలక్ట్రోషూ లు అందరిని ఆకర్షించి, ఆశ్చర్యపరిచాయి.ఇక జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి ఐ.

ఎస్.నారాయణ శుక్లా ( IS Narayana Shukla )సమర్పించిన ప్రాజెక్ట్ అందరినీ ఆకట్టుకుంది.షూస్ నుండి మొబైల్ కు ఛార్జింగ్ పెట్టే విధానం ఒక అద్భుతం అని చెప్పాలి.షూస్ వేసుకొని నడిస్తే ఒక సింగిల్ స్టెప్పుకు దాదాపుగా 12.5 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.ఒక ఐదు కిలోమీటర్లు ఈ షూస్ ద్వారా నడవడం లేదా పరిగెత్తడం చేస్తే మొబైల్ కు 100% చార్జింగ్ ఫుల్ చేయవచ్చు.ఈ షూస్ తయారు చేయడానికి కేవలం రూ.175 ఖర్చు అయ్యింది.అంతేకాకుండా మిలియన్ వోల్టుల విద్యుత్ ను ఒకేరోజు ఉత్పత్తి చేయగల టైల్స్ ను రూపొందించాడు.ఇందులో ఉండే ఈసీపీ అనే పరికరం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ను విక్రయించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube