రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, రాజమౌళి కాంబినేషన్ లో చాలా సినిమాలు తెరకెక్కాయి.

ప్రస్తుతం రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో సైతం రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా రాజీవ్ కనకాల రాజమౌళి గురించి, ఆయనకు జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందో చెబుతూ కీలక విషయాలను వెల్లడించారు.టాలీవుడ్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన రాజమౌళి సినిమా కోసం చాలా కష్టపడతారనే సంగతి తెలిసిందే.

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది.సినిమాలో ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు టేక్ మీద టేక్ తీస్తూ తెరపైన రాజమౌళి అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉంటారు.

రాజమౌళికి జక్కన్న అని పెట్టాననే సంగతి గురించి రాజీవ్ కనకాల చెబుతూ నా సీన్ షూటింగ్ 6 గంటలకు అయితే 10 గంటలకు స్టార్ట్ అవుతుందని రాజమౌళి అంతకు ముందు మొదలుపెట్టిన సీన్ తోనే బిజీగా ఉంటారని రాజీవ్ కనకాల అన్నారు.

Advertisement

ఒక సీన్ ను ఎన్ని విధాలుగా తీయవచ్చో అన్ని విధాలుగా రాజమౌళి షాట్స్ తీస్తారని ఒక సీన్ పూర్తైతే మాత్రమే మరో సీన్ జోలికి వెళతారని రాజీవ్ కనకాల తెలిపారు.ఒకరోజు హాఫ్ పేజ్ సీన్ షూటింగ్ జరగాల్సి ఉండగా ఆ సీన్ కోసం రాత్రి 12.30 గంటలు అయిందని ఆ సమయంలో రాజమౌళి పని రాక్షసుడని జక్కన్నలా సీన్లను చెక్కుతున్నాడని అనుకున్నానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం జక్కన్న పేరు బ్రాండ్ అయిందని సొంత పేరు కంటే జక్కన్న అనే పేరు ఎక్కువగా పాపులారిటీని తెచ్చుకుందని రాజమౌళి గురించి రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ లో రాజీవ్ కనకాల పాత్ర గురించి ప్రశ్నలు ఎదురు కాగా రాజమౌళి షరతులు విధించడంతో చెప్పడానికి ఇష్టపడలేదు.

Advertisement

తాజా వార్తలు