ఇద్దరు నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన క్యారెక్టర్ ఆర్టిస్ట్...

అమ్మాయిల మూలంగానే అబ్బాయిలకు ఎక్కువ గొడవలు వస్తాయనేది అందురూ ఒప్పుకోకపోయినా.చాలా వరకు వాస్తవం ఉందని చెప్పుకోవచ్చు.

ఆడవారి మూలంగానే మహా మహ యుద్ధాలు జరిగాయి అనేది చరిత్ర చెప్తున్న సత్యం.అలాగే ఓ అమ్మాయి మూలంగా ఇద్దరు దిగ్గజ తెలుగు నిర్మాతలు విడిపోయారు.

వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలు నిర్మించారు.అయితేనేం అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరు? ఎందుకు వారు విడిపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఆ దిగ్గజ నిర్మాతలు మరెవరో కాదు.

Advertisement
Character Artist Created Conflicts Between Two Producers Details, Maganti, Mural

మాగంటి వెంక‌టేశ్వ‌ర‌ రావు, మురళీ మోహన్.జయభేరి పతాకంపై వీరిద్దరు కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.

వీరిద్దరు కలిసి నిర్మించిన సినిమాలకు అప్పట్లో ఎంతో డిమాండ్ ఉండేది.నీతి, నిజాయితీకి వీరిద్దరు మారుపేరు.

అలా వారి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి.దానికి కారణం ఓ అమ్మాయి.

మాగంటి వెంకటేశ్వర్ రావుకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుతో చాలా దగ్గరి సంబంధం ఏర్పడింది.అప్పటికే మాగంటికి పెళ్లి అయ్యింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అమ్మాయిని రెండో భార్యగా చేసుకోవాలి అనుకున్నాడు.ఈ నిర్ణయం పట్ల ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి.

Character Artist Created Conflicts Between Two Producers Details, Maganti, Mural
Advertisement

మాగంటి పద్దతి మురళీ మోహన్ కూడా నచ్చలేదు.ఈ విషయాన్ని తనకు చెప్పి చూశాడు.కానీ ఇది నా పర్సనల్ విషయం అన్నాడు.

అయినా వీరిద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు.ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

కానీ మాగంటి చేస్తున్న పని మూలంగా మురళీ మోహన్ కు కూడా ఇబ్బంది కలిగింది.మురళీ మోహన్ పార్ట్ నర్ ఇలా చేస్తున్నాడు అనే టాక్ మొదలయ్యింది.

దీంతో ఓ రోజు మురళీ మోహన్.మాగంటి ఇంటికి వెళ్లాడు.

నీ మూలంగా నాకూ చెడ్డ పేరు వస్తుంది.ఇద్దరం సినిమాలు చేయడం మానేద్దాం అని చెప్పి వచ్చాడు.

అప్పటితో వీరిద్దరి కాంబినేషన్ కు బ్రేక్ పడింది.

తాజా వార్తలు