చలికాలంలో పెదాలు తేమగా ఉండాలంటే.... సూపర్ ఆయిల్స్

చలికాలం రాగానే పెదవులు పగలటం,పొడిగా మారి చాలా ఇబ్బందులను పెడతాయి.దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

ఈ సమస్య నుండి బయట పడటానికి ఎన్నో రకాల క్రీమ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నా కొన్ని రకాల నూనెలతో సులువుగా ఇంటిలోనే పరిష్కారం చేసుకోవచ్చు.ఈ నూనెలతో తేమ గుణాలు ఎక్కువగా ఉండుట వలన పెదాలను పొడిగా లేకుండా తేమగా ఉంచుతాయి.

ఇప్పుడు ఆ నూనెల గురించి వివరంగా తెలుసుకుందాం.

బాదం నూనె పగిలిన,పొడిగా మారిన పెదాలకు బాదం నూనె మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.రాత్రి పడుకొనే సమయంలో పెదాలకు కాస్త బాదం నూనెను రాసుకోవాలి.బాదం నూనె చెర్మంలోని  మృత కణాలను తొలగించి తేమగా ఉండేలా చేస్తుంది.

Advertisement

జొజోబా నూనె ను  పెదవులకు మాలిక్యులేటింగ్ ఏజెంట్ గా పనిచేసి పెదాలను తేమగా ఉంచుతుంది.ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

అందువల్ల పెదాలను తేమగా ఉంచటానికి బాగా సహాయ పడుతుంది.కొన్ని చుక్కల జొజోబా ఆయిల్ని పంచదారలో కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.

మింట్ ఆయిల్పెదాలను తేమగా ఉంచటంలో మింట్ ఆయిల్ చాలా  బాగా సహాయపడుతుంది.ఈ నూనె సులభంగా పెదాలలో శోషించ బడుతుంది.

పొడిని కలిగించే మలినాలను తొలగించి తేమగా ఉంచుతుంది.కొబ్బరి నూనె తో కొన్ని చుక్కల మింట్ ఆయిల్ ని కలిపి మీ పెదాలపై రాసి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
బొప్పాయితో బాడీ సోప్‌.. వాడితే మ‌స్తు బెనిఫిట్స్‌!

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయాలి.

Advertisement

తాజా వార్తలు