ఏపీ కేబినెట్‌లో మార్పులు అనే అంశం ఇప్పుడు జోరుగా హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే జగన్ ప్రకటించినట్టుగా తన కేబినెట్ ఏర్పాటు అయిన రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా కేబినెట్‌లో మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు కేబినెట్ ఏర్పాటు అయి రెండున్నరేండ్లు గడుస్తున్న సందర్భంగా ఇప్పుడు ఎవరిపై వేటు పడుతుందో అనే భావనలో రాజకీయాలు కుత కుత ఉడుకుతున్నాయి.ఇక ఇందులో ప్రధానంగా ఆశావహుల్లో కొందరి పేర్లు వినిపిస్తుండగా.
అందులో చెప్పుకో దగ్గ పేరు నగరి నియోజకవర్గ ఎమ్మెల్మే రోజా.
ఈమెకు మొదటి సారి కేబినెట్ లోనే ఛాన్స ఉంటుందని భావించినా కూడా నిరాశ ఎదురైంది.
కాగా ఆమెను బుజ్జగించేందుకు ఏపీఐఐసీ ఛైర్పర్సన్ పదవి ఇచ్చి కూల్ చేశారు.అయితే రెండోసారి అవకాశం ఇచ్చేందదుకు ఆమెను రీసెంట్ గా ఏపీఐఐసీ పదవి నుంచి తొలగించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కేబినెట్‌లో ఈసారి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా కేబినెట్‌లో ఉండటంతో ఇందులో ఇద్దరిని తప్పించి ఆ స్థానాల్లో కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం.ఇక మరో బలమైన వర్గం అయిన కాపుల్లో కూడా ముగ్గురిని తీసేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇక మరో కోణంలో చూస్తే బీసీ సామాజిక వర్గంలో ఉన్న అందరు మంత్రులను తప్పించి వారందరి ప్లేస్ లో కొత్తవాళ్లను తీసుకుంటారని ఆ మేరకు ఇప్పటికే అన్ని చర్యలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఇక ఎస్సీల్లో ఇప్పుడున్న మంత్రుల్లో ఒకే ఒక్కరిని మాత్రమే ఉంచేసి అందరినీ మారుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కాగా ఈ ప్లాన్ కొత్తదేమీ కాదని మొదటి నంఉచి ఇలాంటి ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది.కానీ ఇప్పుడున్న తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం సామాజిక వర్గాల ఆధారంగా కాకుండా మెయిన్‌గా అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులపై మాత్రమే వేటు వేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.