చంద్రయాన్ 3 లో కీలక పాత్ర పోషించిన తెలుగు మహిళ కల్పన.. ఆ టెన్షన్ పడ్డానంటూ?

మన దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3( Chandrayaan-3 ) ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై అడుగుపెట్టింది.

అందులోని రోవర్ బయటకు వచ్చి సక్సెస్ ఫుల్ గా తన అధ్యయనాన్ని ప్రారంభించింది.

ల్యాండర్ లో పంపిన రోవర్ పేరు ప్రగ్యాన్( Pragyan Rover ) కాగా దీని బరువు 26 కిలోలు కావడం గమనార్హం.ఇందులో రెండు పేలోడ్ లు ఉండగా ప్రస్తుతం రోవర్ తన అధ్యయనాన్ని మొదలుపెట్టింది.

రోవర్ ఆరు చక్రాల సహాయంతో చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పని చేస్తుంది.చంద్రయాన్ 3 సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వాళ్లలో కల్పన( Kalpana ) ఒకరు కాగా ఆమె చంద్రయాన్3 కు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేశారు.తెలుగు మహిళల సత్తా చాటిన కల్పనా కాళహస్తి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.చంద్రయాన్3 విషయంలో చాలా టెన్షన్ పడ్డామని చంద్రయాన్ 3 కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పని చేశామని ఆమె కామెంట్లు చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని( Chittoor District ) తడుకు నా స్వస్థలం అని తండ్రి చెన్నై హైకోర్టులో పని చేసి రిటైర్ అయ్యారని ఆమె తెలిపారు.తాను చెన్నైలోనే చదువుకున్నానని మద్రాస్ యూనివర్సిటీలో బీటెక్ లో ఈసీఈ చదివానని తెలిపారు.ఇస్రోలో( ISRO ) పని చేయాలనేది చిన్నప్పటి కల కాగా బీటెక్ పూర్తైన వెంటనే ఆ దిశగా అడుగులు వేశానని ఆమె తెలిపారు.2000 సంవత్సరంలో ఇస్రోలో ఇంజినీర్ గా ఎంపికయ్యానని ఆమె కామెంట్ చేశారు.

Advertisement

ప్రస్తుతం నేను అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ( Associate Project Director ) పని చేస్తున్నానని కల్పన పేర్కొన్నారు.ఈరోజు ఉండే సవాల్ మరుసటి రోజు ఉండేది కాదని ప్రతిరోజూ కొత్త సవాల్ ఉంటుందని ఆ సవాల్ కు పరిష్కారం కోసం అంకిత భావంతో పని చేయాలని కల్పన కామెంట్లు చేశారు.ఒక్కోసారి 14 గంటల పాటు పని చేసిన రోజులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

వీడియో: కోచింగ్ ముసుగులో మహిళను అసభ్యంగా తాకుతున్న జిమ్ ట్రైనర్..
Advertisement

తాజా వార్తలు