2024 ఎన్నికలకు వైయస్ జగన్( YS Jagan ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకూడదని భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఒంటరిగా పోటీ చేస్తున్నారు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దాదాపు ఏడాది నుండి సర్వేలు చేయించుకుంటూ వాటి ఫలితాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకత మరియు కేడర్ లో వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారు.
అదే సమయంలో కొత్త వారిని నియమిస్తున్నారు.కొంతమందికి స్థాన చలనం కూడా కల్పిస్తున్నారు.
ఈ రకంగానే మచిలీపట్నం లోక్ సభ పార్లమెంట్ ఇంచార్జ్( Machilipatnam Lok Sabha Parliament Incharge ) నీ వైసీపీ అధిష్టానం మార్చడం జరిగింది.తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్ బాబుని ఇంచార్జ్ గా నియమించగా ఇప్పుడు ఆయనను అవనిగడ్డ అసెంబ్లీ సమన్వయకర్తగా ప్రకటించింది.ఇదే సమయంలో మచిలీపట్నం లోక్ సభ ఇంచార్జ్ గా సింహాద్రి చంద్రశేఖర్( Simhadri Chandrasekhar ) ను నియమించినట్లు మాజీమంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని స్పష్టం చేశారు.35 ఏళ్లుగా చంద్రశేఖర్ వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు.2019 ఎన్నికలలో మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గెలవడం జరిగింది.ఆయన కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ( Janasena )లో జాయిన్ అయ్యారు.
ఈ క్రమంలో మచిలీపట్నం ఇంచార్జ్ గా సింహాద్రి చంద్రశేఖర్ ను వైసీపీ అధిష్టానం నియమించటం సంచలనంగా మారింది.