సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో చంద్రముఖి చిత్రం కి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకం.‘బాబా’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా సౌత్ ఇండియా లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.అంతే కాదు ఈ సినిమానే తెలుగు , తమిళ భాషల్లో మొట్టమొదటి హారర్ కామెడీ జానర్ చిత్రం.కన్నడ లో విష్ణు వర్ధన్ హీరో గా నటించిన ‘ఆప్త మిత్ర‘ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత, హారర్ కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో వచ్చాయి.
ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మీద ఎన్నో చిత్రాలు చేసాడు.ముని అనే సినిమా చేసి, దానికి కొనసాగింపుగా కాంచన, గంగ, కాంచన 3 వంటి చిత్రాలను చేసాడు.
అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
ఇప్పుడు ఆయన చంద్ర ముఖి కి సీక్వెల్ గా ‘చంద్ర ముఖి 2( Chandramukhi 2 )’ చిత్రం తో మన ముందుకు వచ్చాడు.నిన్న స్కంద చిత్రం తో పాటు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.పోనీ ఓపెనింగ్స్ అయినా వచ్చాయా అంటే అదీ లేదు.
ఎదో చంద్ర ముఖి బ్రాండ్ మీద కాస్త చిల్లర అయినా వచ్చింది కానీ, లేకపోతే ఇంకా దారుణంగా ఉండేవి.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి అదనంగా మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.మొత్తం మీద 12 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా,
ఆరు కోట్ల 5 లక్షల రూపాయిల
షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 46 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది.కానీ ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిన ఈ వీకెండ్ లోనే రాబట్టాలి, ఆ తర్వాత కనీసం చిల్లర రేంజ్ వసూళ్లు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.లారెన్స్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే ఛాన్స్ ఉంది.ఒక క్లాసిక్ సినిమాకి సీక్వెల్ చేసి చెడగొట్టారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ లారెన్స్ పై విరుచుకుపడుతున్నారు.