రాయదుర్గం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అనంతపురం జిల్లా రాయదుర్గంలో( Rayadurgam ) పర్యటించడం జరిగింది.“భవిష్యత్తు గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రభుత్వం పై( CM Jagan ) విమర్శల వర్షం కురిపించారు.పెట్టుబడులు ఇస్తామని రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పంట బీమాతో రైతులకు అండగా నిలబడతామని పేర్కొన్నారు.ఇదే సమయంలో రాయలసీమకు గోదావరి జలాలు తీసుకురావటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.తెలుగుదేశం ప్రభుత్వంలో సాగునీటి కోసం 69 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.

 Chandrababu Sensational Remarks In Rayadurgam Sabha Details, Tdp, Chandrababu,-TeluguStop.com

గతంలో రాయలసీమ( Rayalaseema ) కోసం 22 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు కూడా పేర్కొన్నారు.అయితే జగన్ ప్రభుత్వం కేవలం 2000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వ్యాఖ్యానించారు.టీడీపీ ( TDP ) అధికారంలో ఉంటే వాటికి రాయలసీమకు నీళ్లు ఇచ్చే వాళ్ళమని పేర్కొన్నారు.రాయలసీమలో మొత్తం 102 ప్రాజెక్టులను ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చాక రైతును రాజును చేసే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పుకొచ్చారు.వైసీపీ హయాంలో వ్యవసాయం వెంటిలేటర్ పై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 34 లక్షల ఎకరాలు ఎండిపోయాయని.కరువు పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube