₹2000 నోట్లను( Rs 2000 Denominations ) రద్దు చేస్తూ ఆర్బీఐ ( RBI ) సంచలన ప్రకటన చేయడం తెలిసిందే.ఈ క్రమంలో ₹2000 నోట్లు కలిగివున్న ప్రజలు సెప్టెంబర్ 30లోగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించడం జరిగింది.
మే 23వ తారీకు నుంచి ఆర్బీఐ రీజినల్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు అని పేర్కొంది.అయితే ₹2000 నోట్లు రద్దు ఆర్బీఐ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్పందించారు.₹2000 నోట్లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇదే సమయంలో ₹500 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఇలా చేయటం వల్లే రాజకీయ నేతల అవినీతి తగ్గుతుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో తానే డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు.
కేంద్రం ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది.మనీలాండరింగ్ నియంత్రణ జరగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 30లోగా ₹2000 నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేసి మార్చుకోవచ్చు.ఒక బ్రాంచ్ లో ఒకేసారి గరిష్టంగా ₹20వేలు మార్చుకోవచ్చని.
అప్పటిదాకా ₹2000 నోట్లు చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది.