మీ రాతలతో చంద్రబాబు తలరాత మార్చలేరుఃమంత్రి పెద్దిరెడ్డి వంకర అంతా ఈనాడు రాతల్లో, టీడీపీ సమర్థనల్లోనే.రాష్ట్ర గనులు, అటవీ, పర్యావరణం, శాస్త్రసాంకేతిక, ఇంధన శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ మీ బుద్ధి, కుక్క తోక వంకరను ఎవరూ సరిచేయలేరు ఈనాడు మేత, టీడీపీ మేతకు గండి పడిందనే వాళ్ళ బాధ మైనింగ్ లో అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 13 విజిలెన్స్ స్వ్కాడ్ లు.
మైనింగ్ ను ఎస్ఇబి పరిధిలోకి తీసుకువచ్చాం అవినీతి, అక్రమాలకు తావులేకుండా బరువు ఆధారిత సెస్ వసూలు.జీపీఎస్ తో మైనింగ్ ట్రాకింగ్ టీడీపీ హయాంలో విశాఖలో లక్షల కోట్ల ల్యాండ్ స్కాం జరిగితే.
మాపై నిందలా.ఉత్తరాంధ్రను “షేవ్” చేసిన వారు.“సేవ్” చేస్తారా.?మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే.ఈనాడుకు చంద్రబాబు పిచ్చి పట్టింది” రోజూ చచ్చేవాడి గురించి ఏడ్చేవారు ఎవరు… !” అన్నది సామెత.ఈనాడు పత్రికను, తెలుగుదేశం పార్టీని చూస్తే అదే అనిపిస్తోంది.నిన్న ఈనాడు పత్రికవారు ” కంకర లీజుకు వంకర బుద్ధి” అని వార్త రాశారు.
దానికి మా డీఎంజీ గట్టిగా సమాధానం ఇచ్చాడు.తిరిగి ఈ రోజు ” గ్రానైట్ రవాణాలో నేతల మేత.” అని మరో వార్త రాశారు.ఈ రెండు వార్తలు చూస్తే.
ఒక విషయం అర్థమవుతోంది.ఈ పత్రికు చంద్రబాబు పిచ్చి పట్టింది.
చంద్రబాబును అర్జంట్ గా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి, అర్జంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీ నుంచి దించేయాలని ఆ పత్రిక అనుకుంటోంది.ఈనాడు పత్రిక- చంద్రబాబును రాజకీయంగా పైకి తీసుకురావాలని దింపుడు కల్లం ఆశతో పనిచేస్తుంది.
రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారి వెంట నడుస్తున్నారు.ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుగానీ, టీడీపీగానీ మద్దతును సాధించలేవు.
ప్రజల మద్దతు జగన్ గారికి పూర్తిగా ఉంది.దానిని పక్కదోవ పట్టించేందుకే రోజూ ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారు.
అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబరు మైనింగ్ కు సంబంధంచి ఏమైనా అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తాం.గ్రానైట్, మైనింగ్ కు సంబంధించి ఎక్కడ ఎవరు అక్రమంగా వసూళ్ళకు పాల్పడినా ఆ నంబర్ కు ఫోన్ చేయండి.
ప్రతి ఫిర్యాదును నేనే స్వయంగా మానిటర్ చేస్తాను.నిజం అని తేలితే చర్యలు తీసుకుంటాం.మేం ఇప్పటికే చాలా మంది అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నాం.మైనింగ్ లో అవినీతి, అక్రమాలను అరికట్ట గలిగాం.అందువల్లే గత ఏడాది రూ.3,765 కోట్లకు మైనింగ్ రెవెన్యూను పెంచగలిగాం.ఈ ఏడాది కూడా రూ.5వేల కోట్ల వరకు టార్గెట్ ఇచ్చాం.దానిని కూడా రీచ్ అవుతాం.
ఈ-ఆక్షన్ అనేది అత్యంత పారదర్శక విధానం.
ఇందులో అక్రమాలకు తావే ఉండదు.ఈ విషయం ఈనాడు పత్రికకు తెలియక కాదు, తెలిసే వారు కావాలని తప్పుడు వార్తలు రాస్తున్నారు.
ఈ-ఆక్షన్ ద్వారా పారదర్శకంగా మేం నిర్వహించిన మైనింగ్ లీజులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు, మూడు అవార్డులు కూడా వచ్చాయి.అక్రమాలను అరికట్టేందుకు ఎస్ఇబి పరిధిలోకి మైనింగ్ ను తీసుకురావాలని సీఎం గారు సమీక్షలో ఆదేశించారు.
ఆ మేరకు ఎస్ఇబి మైనింగ్ ఆపరేషన్స్ పై పర్యవేక్షణ చేస్తోంది.అంతేకాదు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశాం.
గతం కన్నా చెక్ పోస్ట్ ల సంఖ్యను పెంచాం.సిసి కెమేరాలను ఏర్పాటు చేశాం.
ప్రకాశం జిల్లాలో విలువైన గ్రానైట్ ఉంది.అక్కడి నుంచి అక్రమ రవాణా జరగకూడదని తుమ్మలచెరువు, నడికుడి వద్ద రెండు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశాం.
గతంలో ఆరు రీజనల్ విజిలెన్స్ స్వ్కాడ్ లు ఉంటే, ఇప్పడు పాత పదమూడు జిల్లాలకు పదమూడు రీజనల్ విజిలెన్స్ స్వ్కాడ్ లను పెట్టాం.మినరల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ట్రాకింగ్ కోసం జిపిఎస్ సిస్టంను ఏర్పాటు చేశాం.
ఈ విధంగా అన్ని రకాలుగా అక్రమాలను కట్టడి చేస్తున్నాం.ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.
ఇంకా ఎక్కడైనా కొందరు తప్పు చేస్తూ ఉండవచ్చు.దానిని కూడా అరికట్టేందుకు తాజాగా టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తున్నాం.
మీ రాతలతో బాబు తలరాతను మార్చలేరు గ్రానైట్ సెస్ కు సంబంధించి బరువు ఆధారిత పన్ను విధానాన్ని అమలులోకి తీసుకువచ్చాం.ఇంత పకడ్బందీగా ప్రభుత్వం పనిచేస్తూన్నా, ఇన్ని నిర్థిష్టమైన వ్యవస్థలు ఉన్నా కూడా ఏదో తప్పు జరిగిపోతోందంటూ ఈనాడు ప్రతిక రోజూ తప్పడు కథనాలను రాయడం బాధాకరం.
తప్పు జరిగితే ఫలానా చోట, ఫలానా వ్యక్తి చేశాడని నిర్ధిష్టంగా చెప్పాలి.వాటిపై చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.అలా కాకుండా తమ రాతలతో చంద్రబాబు తలరాతను మార్చాలని ఈనాడు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.టీడీపీ హయాంలోనే విశాఖలో లక్షల కోట్ల భూదందాలువిశాఖలో ల్యాండ్ స్కాం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఈనాడు పత్రిక వరుస కథనాలను రాస్తోంది.
మూడు రాజధానులు రాకూడదని, విశాఖకు పరిపాలన రాజధాని ఉండకూదనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారు.ఉత్తరాంధ్ర, విశాఖపై విషం చిమ్ముతున్నారు.
టిడిపి హయాంలోనే విశాఖలో లక్షల కోట్ల రూపాయల భూదందా జరిగినట్లు ఈనాడు పత్రికల్లోనే ఆనాడు రాశారు.దాన్ని పక్కన పెట్టి, మా ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇప్పుడే మా హయాంలోనే జరిగినట్లు అభూతకల్పనలతో వార్తలు రాస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే దొంగ ఒకరు అయితే మరొకరిని దొంగగా చూపించి, అసలు దొంగను దొరగా చేసేందుకు పడుతున్న తంటాలుగా కనిపిస్తోంది.
మీ బుద్ధి, కుక్కతోక వంకరను సరి చేయలేం కుక్కతోక వంకరగా ఉంటే మనం ఏం చేయలేము.ఈనాడు పత్రిక నిర్థిష్టంగా ఎక్కడైనా తప్పు జరిగితే దానిని మా దృష్టికి తీసుకువస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం.అలా కాకుండా వంకర బుద్ధితో తప్పుడు రాతలు రాస్తుంటే వారిని మార్చలేము.
మైనింగ్ లీజు దారులు అక్రమాలకు పాల్పడితే వారు ఎవరైనా, ఎటువంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకున్నాం.చాలా మంది లీజుదారులను డిటర్మినేషన్ చేశాం.ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.ఇవ్వన్నీ తెలిసి కూడా ఈనాడు పత్రిక వక్రీకరణ కథనాలతో చంద్రబాబును రాజకీయంగా పైకి లేపాలని ప్రయత్నిస్తోంది.
చంద్రబాబు రాజకీయంగా నడవలేని వ్యక్తి.మీ రాతల ద్వారా ఆయనను ఎంత పైకి లేపినా… మళ్ళీ మళ్ళీ చతికిల పడతాడే తప్ప తిరిగి అధికారంలోకి రావడం కల్ల.
ఈ విషయాన్ని ఈనాడు రామోజీ తెలుసుకుంటే మంచిది.
ఉత్తరాంధ్రను దోచుకున్నవారే “సేవ్” అంటున్నారు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.
మైనింగ్ అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం కోట్లాది రూపాయల మేరకు జరిమానాలు విధించాం.ఉత్తరాంధ్రను ఎవరైతే దోచుకున్నారో.వాళ్ళే ఇవాళ సేవ్ ఉత్తరాంధ్ర అంటున్నారు.రుషికొండపై అక్రమాలు ఏమీ జరగటం లేదు.
తెలుగుదేశం పార్టీ, ఒక సామాజిక వర్గం వారే అమరావతిలో పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడ్డారు.ఈ భూముల ద్వారా లక్షల కోట్లు సంపాదించాలని అనుకున్నారు.
అందుకే వారు చంద్రబాబు డైరెక్షన్ లో ఒక రియల్ ఎస్టేట్ పాదయాత్రను ప్రారంభించారు.అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లి సేవ్ ఉత్తరాంధ్ర అనాల్సిన అవసరం లేదు.
ఏ ప్రాంతం వారికి తమ ప్రాంతాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసు.ప్రతి ప్రాంతం తమ ప్రాంతం బాగుండాలని కోరుకుంటారు.
రిషికొండను చూడాల్సిందేనంటూ.దానిని వివాదం చేస్తున్నారు.
వారిని ఎవరూ అడ్డుకోవడం లేదు.అమరావతి పాదయాత్రను ఎందుకు నిలిపేశారో వారే స్పష్టం చేయాలి.
చివరికి న్యాయస్థానానికి వెళ్ళినా వారికి చుక్కెదురైన విషయం వాస్తవం కాదా?
అమరావతి ప్రాంతంలో తెలుగుదేశానికి చెందిన ఒక సామాజికవర్గం వారే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని నాడు పత్రికల్లోనే రాశారు.అమరావతి ప్రాంతంలో బిసి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల వారు రాకూడదని, వారికి స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు కూడా వెళ్ళారు.
ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్ రవాణాలో ఏదో జరుగుతోందంటూ రాసిన వార్తలో ఎటువంటి నిజం లేదు.ఈనాడు పత్రికకు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా రాయడం అలవాటు.
రవాణాదారులను ఆపి వసూళ్ళు చేస్తున్నారా? రౌడీయిజం జరుగుతోందా? అలా అయితే ఇన్ని రోజులు మీరు ఎందుకు దీనిపై రాయలేదు.గతంలో రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి సీఎంలుగా పనిచేసిన వారు కూడా హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేశారు.
దీనివల్ల అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయ్యింది.దీనికి భిన్నంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ గారు వికేంద్రీకరణను, మూడు రాజధానులను ప్రతిపాదించారు.
రాయలసీమ ప్రాంతానికి న్యాయ రాజధాని కావాలని కోరుకుంటున్నా.