కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయి.కోపాన్ని కొద్దిసేపటి వరకు కంట్రోల్ చేసుకుంటే ఎన్నో అనర్థాల నుంచి తప్పించుకోవచ్చు.
రోడ్డు ప్రమాదాలంటే అందరికీ భయం.వాటిని చూస్తున్నంత సేపు ఒళ్లు గగుల్పొడుస్తాయి.తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఇరుకైన వీధిలోని ప్రవేశించిన ఓ కారు డ్రైవర్‌కు, బైక్ ఆపిన వ్యక్తి మధ్య తలెత్తిన గొడవ.నలుగురి ప్రాణాలపై వచ్చిపడింది.
కారు డ్రైవర్‌కు బైకర్ మధ్య తలెత్తిన వాగ్వాదంలో ఆ ప్రదేశంలో నలుగురు గుమిగూడారు.
దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్ బైకర్‌ను ఢీకొని కొందరిపై కారు దూసుకెళ్లాడు.ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ నెల 26వ తేదీన అలీపూర్ ప్రాంతంలోని ఓ ఇరుకు వీధిలోకి కారు ప్రవేశించింది.
ఇంతలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి కారును క్రాస్ చేసి.కొంచెం ముందుకు వెళ్లి కారును ఆపాడు.
దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.అయితే స్థానికులు జోక్యం చేసుకుని వీరిద్దరినీ సర్ది చెప్పి పంపడానికి ప్రయత్నించారు.
దీంతో ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్.కారులోకి ఎక్కి ముందుగా డ్రైవర్‌ను ఢీకొట్టాడు.

ఆ తర్వాత వేగంగా అక్కడ నిలబడ్డ ప్రతిఒక్కరిపై కారు ఎక్కించాడు.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.వీరిని స్థానిక ఆస్పత్రి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.కాగా, దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది.ఈ వీడియోను ఇప్పటివరకు 35.3కే వ్యూవ్స్ వచ్చాయి.కారు డ్రైవర్ ఎంతో దుర్మార్గకంగా ప్రవర్తించాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.








