ఈ పరిణామాలు తెలుగుదేశానికి ఇబ్బందికరమేనా ?

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మింగుడు పడడం లేదు.ఏదో ఒక రకంగా పార్టీని గట్టెక్కించాలని చూస్తున్నా కుదరడం లేదు.

పార్టీలో నాయకుల వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారింది.చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశారు.

ఆ తీవ్రమైన సంక్షోభంలో ఉంటూ పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చారు.అప్పటి పరిస్థితులు కాస్త సానుకూలంగా ఉన్నట్టుగా కనిపించినా, ప్రస్తుతం మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

వైసీపీ అధికారంలోక వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తోంది.ఈ సంవత్సరం కాలం పాటు టిడిపి ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Advertisement

ఈ నాలుగేళ్ల పాటు పార్టీని చంద్రబాబు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది ప్రశ్నగా మారింది.గతంలో చంద్రబాబు ఎన్నో సంక్షోభాలు చవిచూశారు.

అప్పట్లో టిడిపికి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండేది.కాంగ్రెస్ పార్టీలో ఉండే గ్రూపు రాజకీయాలు అన్నిటినీ చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే వారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.

ఇక ఆ పార్టీ అధినేత జగన్ ఎంత మొండి వాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

ప్రస్తుతం వైసిపి అధికారంలో ఉండటంతో తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడమే ప్రధాన ధ్యేయంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.అది కాకుండా గతంలో బిజెపి టీడీపీకి మద్దతు గా ఉండేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

Advertisement

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవడం లేదు.ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తుపై బెంగతో ఉన్న నాయకులంతా ఏపీ అధికార పార్టీ వైసీపీలోనూ, కేంద్ర అధికార పార్టీ బీజేపీ లో చేరిపోయారు.

అంతేకాకుండా పార్టీ లో మొదటి నుంచి ఉన్న నాయకులు కూడా వలసబాట పట్టారు.దీంతో నియోజకవర్గ స్థాయిలో పార్టీని ముందుకు నడిపించే నేతలు కరువవడంతో టిడిపి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది.

పోనీ ఈ సమయంలో పార్టీ భవిష్యత్తు పై పూర్తి స్థాయిలో దృష్టి పెడదామనుకున్నా పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు.తాను తప్ప తన స్థాయిలో పార్టీని ముందుకు తీసుకు వెళ్ళ గలిగే సమర్ధుడైన నాయకుడు కూడా చంద్రబాబుకు దొరకడ లేదు.

ఒకవైపు వయసు పైబడుతున్న తరుణం లో తన రాజకీయ వారసుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు పైన చంద్రబాబుకు బెంగ ఎక్కువైంది.ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా పార్టీని, పార్టీ నాయకులను గట్టెక్కించి వలసలు పెరగకుండా చూడాలనే విషయం పై చంద్రబాబు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం తీవ్రమైన కష్టకాలం నడుస్తున్నట్టు గానే కనిపిస్తోంది.

తాజా వార్తలు