ఆర్ఆర్ఆర్.అంటే వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతున్న సినిమా అనుకుంటుంటారు కొందరు.
అవును ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.కాగా, ఈ ఆర్ఆర్ఆర్ పేరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి కూడా ప్రస్తావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
ఈ నరసాపురం ఎంపీ వైసీపీ నుంచి లోకసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ సొంత పార్టీపైన ఎదురు తిరిగి తనదైన సెపరేటు స్టైల్ లో పాలిటిక్స్ చేస్తున్నారు.తాజాగా రఘురామకృష్ణరాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ సభలో కౌగిలించుకున్నారు.
దాంతో ఆ కౌగిలి బంధం వెనకున్న రాజకీయం ఏంటో మరి అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అమరావతియే రాజధానిగా ఉండాలని రైతులు నిర్వహించిన సభకు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే అక్కడే సభలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు ఎదురెళ్లి మరీ స్వాగతం పలికి కౌగిలించుకున్నారు.ఇక బాబు సైతం ఆర్ఆర్ఆర్‌ను కౌగిలించుకుని ఆత్మీయత చూపారు.
ఈ క్రమంలోనే వైసీపీ వారు చేస్తున్న ఆరోపణ పలికేది రఘురాముడు పలికించేది చంద్రబాబు అనే ఆరోపణను గుర్తు చేస్తున్నారు.

తమ పార్టీ టికెట్ మీద గెలిచి తమనే విమర్శిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబును కౌగిలించుకోవడం గురించి తెలుసుకుని వైసీపీ నేతలు మండిపడుతున్నారట.తమ ప్రత్యర్థి అయిన చంద్రబాబును వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కలుసుకోవడం వైసీపీ వర్గాలకు నచ్చడం లేదట.మొత్తానికి అమరావతి రైతుల సాక్షిగా రఘురామకృష్ణరాజు మరోసారి వైసీపీ అధినేత, ఏపీ సీఎంపై విమర్శలు చేశారు.
అయితే, గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజు వైసీపీకి వ్యతిరేకంగా వెళ్తున్నప్పటికీ అధిష్టానం అయితే ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.మొత్తానికి రఘురామకృష్ణరాజు ప్రత్యర్థిని కౌగిలించుకుని సొంత పార్టీ అధినేత, నేతలకు కోపం తెప్పించారని చెప్పొచ్చు.







