ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) దళితులను మరోసారి అవమానించారు.గతంలోనూ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు తన గుణం మారలేదని మరోసారి రుజువు చేసుకున్నారు.
దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వ్యాఖ్యానించిన ఆయన తాజాగా దళిత అభ్యర్థిని కించపరిచారు.దళిత, అణగారిన వర్గాల ప్రజలు రాజకీయంగా ఎదగడం ఏ మాత్రం ఇష్టపడని చంద్రబాబు ఈ విధంగా అవమానిస్తున్నారంటూ ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లా శింగనమలలో( Singanamala ) ఎస్సీ వ్యక్తిని చంద్రబాబు బహిరంగంగా అవమానించారు.శింగనమల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మన్నెపాక వీరాంజనేయులను( Mannepaka Veeranjaneyulu ) చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడారు.
‘‘ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా వాళ్ల టిప్పర్ డ్రైవర్ కు సీఎం జగన్( CM Jagan ) టికెట్ ఇచ్చారు.అవునా.నిజమేనా? ఎడమ చేతి వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చాడు.గొప్పోడయ్యా.
తప్పకుండా అభినందించాల్సిందే.ఆయన తెలివితేటలకు ధన్యవాదాలు.
శభాష్’’ అంటూ చంద్రబాబు అన్నారు.
వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు చంద్రబాబు అనుకున్నట్లు నిరక్షరాస్యుడు కాదు.ఆ విషయం తెలుసుకోవాలని కూడా ఆయన భావించలేదు.వేలిముంద్ర వేయించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ కు జగన్ టికెట్ ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
పేదల పట్ల, ఎస్సీల పట్ల ఎంత చులకన భావం ఉందో, వారిని ఏ విధంగా అవమానిస్తున్నారోనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైంది.పేదలు, ఎస్సీలు చంద్రబాబు దృష్టిలో వేలిముద్రగాళ్లేనా అంటూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
నిజానికి వీరాంజనేయులు ఎంఏ, బీఈడీ చదివారు.గతంలోని టీడీపీ( TDP ) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆయన టిప్పర్ డ్రైవర్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది.పేద వర్గాలకు చెందిన వ్యక్తులను వైసీపీ అభ్యర్థులుగా( YCP Candidates ) ప్రకటించడాన్ని కూడా చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని తెలుస్తోంది.టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అంటూ బాబు కామెంట్స్ పై దళిత వర్గాలపై( Dalits ) ఆయనకున్న వ్యతిరేకత ఏంటనేది స్పష్టంగా అర్థం అవుతుంది.
అత్యంత సాధారణ వ్యక్తులను చట్టసభలకు పంపుతూ… పేదలకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు.ఈ క్రమంలో మాధవి, నందిగం సురేశ్ లను ఎంపీలుగా ప్రకటించి తాను అణగారిన వర్గాల పక్షపాతినని ఇప్పటికే జగన్ చాటిచెప్పిన సంగతి తెలిసిందే.అయితే చంద్రబాబు ఓ దళిత అభ్యర్థి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం.ఎస్సీ, ఎస్టీల పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుపై ఏపీ వాసులు మండిపడుతున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.