రాజకీయ కక్షతోనే తమ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ధర్మమే గెలుస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 23 మంది మృతిచెందడం బాధాకరమని వెల్లడించారు.ఈ క్రమంలోనే మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం టీడీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటించాలని సూచించారు.