వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చేసిన వ్యాఖ్యల తాలకూ మంటలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చల్లారలేదు.గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు మరియు వైసీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని హెచ్చరిస్తున్నారు.మరో పక్క పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీడియా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది . వాలంటీర్ వ్యవస్థ( Volunteer system ) సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుందా లేదా అనే విషయంపై భారీ ఎత్తున మీడియా సంస్థలు చర్చలను ప్రసారం చేస్తున్నాయి .

ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) కూడా పవన్ వ్యాఖ్యలను మద్దతుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుంది.వాలంటీర్లు కేవలం పౌరసరఫరాలకు మాత్రమే పరిమితం కావాలని ,రాజకీయాల్లో వేలు పెట్టకూడదని వాలంటీర్లు డేటా సేకరించడం ద్రోహం అని డేటా ప్రైవసీ కి సంబంధించి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొన్ని సేవలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా ఆలోచిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా అగ్నిజ్వాలలో రగులుతున్న ప్రస్తుత విషయంపై ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయకుండా ఆచి తూచి జాగ్రత్త మాట్లాడిన చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ పై తమ వ్యతిరేకతను మాత్రం బయట పెట్టుకున్నట్లు అయింది.

వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా జగన్( jagan ) అనుకూల వ్యవస్థ అని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ కి ప్రయోజనం కలిగే లాగ మైక్రో లెవెల్ లో చక్రం తిప్పుతుందని అంచనాలు ఉండడంతో తెలుగుదేశం- జనసేన పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే సంఖ్యాపలంగా బలంగా ఉండటంతో ఆచితూచి వ్యవహరించాల నే ఆలోచనలో తెలుగుదేశం ఉంటే జనసేనా ని మాత్రం డైరెక్ట్ అటాక్ చేశారు .ఈ ప్రయత్నంలో ఎవరికి ఎంత మంచి జరుగుతుందో తెలియదు కానీ వ్యవస్థ తళుకు లోపాలు సరి అయితే మాత్రం అదే ఆనందం అంటున్నారు సామాన్య ప్రజానీకం
.






