టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని విమర్శించారు.
ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును 30 వేల ఓట్లతో ఓడిస్తామని చెప్పారు.
జగన్ కు భయపడే మూడు నెలలకు ఒకసారి కుప్పంకు చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైనా అభ్యంతరం చెప్తారా అని ప్రశ్నించారు.
కుప్పంలో కావాలనే చంద్రబాబు ఇల్లు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.