చంద్రబాబు సంచలన శపథం.. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మళ్లీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత.అసెంబ్లీలో అడుగు పెడతానని పేర్కొన్నారు.

Chandrababu Sensatational Challenge In Ap Assembly Details, Andhra Pradesh, Asee

వైసీపీ నేతలు కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు.కుప్పం గురించి తనని చులకన.

చేసిన వ్యక్తి గతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.కానీ ఇంట్లో ఉన్న భార్య గురించి తప్పుగా మాట్లాడటం జరిగిందని.

Advertisement

అందువల్లే సభ నుంచి వెళ్లి పోతున్నట్లు పేర్కొన్నారు.మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం చేసి.

తీవ్ర ఆగ్రహంతో అసెంబ్లీ నుండి వెళ్ళిపోయారు.అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీలో మాత్రమే కాక అంతకుముందు టీడీపీ ఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబు కంటతడి పెట్టినట్లు సమాచారం.

ఈ క్రమంలో అసెంబ్లీలో.ఇంట్లో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటంతో భావోద్వేగానికి గురై తన నిర్ణయాన్ని వెల్లడించి సభ్యులందరికీ నమస్కరిస్తూ సభ నుండి వెళ్లిపోయారు.

దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..
Advertisement

తాజా వార్తలు