చంద్రబాబు( Chandrababu ) తన జైల్ జీవితం అనే చాప్టర్ కు ముందు వరకూ చంద్రబాబు కేంద్ర బిజెపితో పొత్తు కోసం తహతలాడేవారు.సందర్భం ఉన్నా లేకపోయినా కూడా మోడీ పరిపాలనపై పొగడ్తలు కురిపించేవారు .
గతంలో ఎన్డీఏ కూటమి నుంచి టిడిపి( TDP ) బయటకు వచ్చినపుడు జరిగిన చేదు జ్ఞాపకాలను బిజెపి అధిష్టానం మరిచిపోయేలా బాబు వ్యవహార శైలిని ఉండేది .అయితే ఎన్ని చేసినా బాబుతో బంధం కంటే జగన్తో స్నేహానికే బిజెపి పెద్దలు మొగ్గు చూపినట్లుగా ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.దేశ రాజకీయాల లోనే అత్యంత సీనియర్ నాయకుడైన తనను అధికార వైసిపి ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే కనీసం మద్దతు కూడా ప్రకటించని కేంద్ర పెద్దల మీద చంద్రబాబుకు ఇప్పుడు మనసు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది.

జైలు జీవితం తన రాజకీయ ప్రయాణంపై పూర్తిస్థాయి క్లారిటీని చంద్రబాబుకు ఇచ్చిందని అందుకే జగన్( jagan ) స్నేహితుడైన కెసిఆర్ కంటే తన అనుచరుడు నాయకుడైన కాంగ్రెస్ గెలిస్తేనే తమకు మంచిదని వ్యూహాత్మకం గానే తెలంగాణలో టిడిపిని పోటీకి పెట్టకూడదని నిర్ణయించుకోవడం జరిగిందని , అంతిమంగా కాంగ్రెస్కు మేలు జరిగి రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections ) కనుక కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటే బాబు ప్లాన్ బి అమలు చేస్తారని, బిజెపికి వ్యతిరేకంగా మరోసారి చంద్రబాబు వ్యూహాలు రూపొందించే అవకాశం కూడా కనిపిస్తుంది.

అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేనందువలన ఆచితూచి స్పందిస్తున్న చంద్రబాబు ఒకసారి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యి రాజకీయ భవిష్యత్తుపై ఒక క్లారిటీ వస్తే అప్పుడు సూపర్ ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.తెలంగాణలో కనుక కాంగ్రెస్ విజయం సాధిస్తే అప్పుడు ఆటోమేటిక్గా బాబు కాంగ్రెస్తో జట్టు కట్టి జనసేన, తెలుగుదేశం ,కాంగ్రెస్, వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.తన అష్ట దిగ్బంధనం వెనుక కేంద్ర పెద్దల అండ ఉందని నమ్ముతున్న చంద్రబాబు అనుకూల పరిస్థితి కోసం వేచి చూస్తున్నారని ఒకసారి బిజెపి గ్రాఫ్ తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తే మాత్రం బాబు విజృంభిస్తారని కొంతమంది రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.