వైనాట్ 175 అనే నినాదాన్ని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప( CM jagan )దే పదే వినిపిస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు.
దీనికి కారణం కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు వైసీపీకి అండగా నిలబడడమే .ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కువగా ఆ సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారు.ఆ వర్గాలే ఎన్నికల్లో తమకు అండగా నిలబడతాయని బలంగా నమ్ముతుండగా, ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు ను దెబ్బతీసే విధంగా, దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

ముఖ్యంగా బీసీ ,ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే విధంగా జగన్ మొదటి నుంచి ప్రయత్నిస్తూ ఉండడం, ఆ వర్గాలకు మేలు చేసే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో, మెజార్టీ సంఖ్యలో ఆ వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే సర్వే రిపోర్టులు బాబు( N.Chandrababu Naidu )కు అందాయి.దీనికి తోడు ఇటీవల విజయవాడలో బీసీ గర్జన వైసిపి నిర్వహించింది .అదే తరహాలో ఎస్సీ ఎస్టీ గర్జనలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉండడంతో టిడిపి అలర్ట్ అయింది .ఆ సామాజిక వర్గాల్లో చీలిక తెచ్చే విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తుంది.

దీనిలో భాగంగానే దళిత నేతలతో కీలక భేటీలను చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారు.ప్రతి దళిత గడపకు టిడిపి వెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించబోతున్నారు.దీనికోసం టిడిపి ఎస్సీ సెల్ విభాగంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు ఏ స్థాయిలో లబ్ధి చేకూర్చామో వివరించబోతున్నారు.రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామనే విషయాన్ని ఆ వర్గం ప్రజలకు వివరించే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

మొత్తం 29 అసెంబ్లీ రిజర్వడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి( TDP ) నుంచి దళిత వర్గాలకు చెందిన ఒక్కరే విజయం సాధించారు.దీంతో ఆ పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఏర్పడకుండా టిడిపి ముందుగానే ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే విధంగా వ్యూహాలు రచిస్తోంది.







