Chandrababu Naidu : ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఓపెన్ ఛాలెంజ్ చేశారు.జగన్ హామీల వీడియో పెట్టి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

 Chandrababu Open Challenge To Ap Cm Jagan-TeluguStop.com

సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి, బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని ఆరోపించారు.విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ అంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు.ఇంకా యాభై రోజులే ఉందని ట్వీట్ లో వెల్లడించారు.రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

బూటకపు ప్రసంగాలు కాదు…అభివృద్ధి పాలన ఎవరిదో.విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామంటూ సవాల్ చేశారు.

ఈ క్రమంలోనే దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రా.! అని చెప్పారు.ప్లేస్, టైం నువ్వే చెప్పు.ఎక్కడికైనా వస్తా.దేనిమీదైనా చర్చిస్తా.నువ్వు సిద్ధమా జగన్ ( CM Jagan )అంటూ ఛాలెంజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube